IPL 2019 FINAL : హైదరాబాద్‌లో నేడు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు..

ఫైనల్‌ మ్యాచ్‌ కోసం స్టేడియం పరిసరాల్లో మొత్తం 300 సీసీటీవి కెమెరాలు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నిఘా పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.

news18-telugu
Updated: May 12, 2019, 3:22 PM IST
IPL 2019 FINAL : హైదరాబాద్‌లో నేడు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు..
హైదరాబాద్ మెట్రో రైలు (File)
news18-telugu
Updated: May 12, 2019, 3:22 PM IST
హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ ఫైనల్ కోసం నేడు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నిజానికి ఈ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగాల్సి ఉన్నా.. కొన్ని కారణాల రీత్యా హైదరాబాద్‌కు మార్చారు. దీంతో హైదరాబాద్ వాసులకు ఫైనల్ మ్యాచ్ వీక్షించే అదృష్టం దక్కింది. ఉప్పల్ మైదానంలో నేటి రాత్రి 8గం.కు రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని.. మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటిగంటకు వరకు నడపాలని మెట్రో రైల్ అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

నేడు మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడపనున్నాం. ఇందుకోసం అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాచకొండ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించాం. ఉప్పల్ మైదానం చుట్టుపక్కల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీసీటీవిలతో నిఘా పర్యవేక్షణ కొనసాగుతుంది.
ఎన్‌విఎఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్


ఇదిలా ఉంటే, ఫైనల్‌ మ్యాచ్‌ కోసం స్టేడియం పరిసరాల్లో మొత్తం 300 సీసీటీవి కెమెరాలు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నిఘా పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. హెల్మెట్, పవర్ బ్యాంక్, సిగరెట్లు, ల్యాప్‌టాప్, మద్యం, తినుబండారాలు, వాటర్ బాటిల్స్ లాంటివి స్టేడియంలోకి అనుమతించమని చెప్పారు.

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...