Hyderabad Metro: మెట్రో రైల్ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

Hyderabad Metro Rail | మరో రెండు రైళ్లకు సంబంధించిన ట్రయల్స్ ఇప్పుడు నడుస్తున్నాయని, మరో 10 రోజుల్లో వాటి సేవలు ప్రారంభించనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

news18-telugu
Updated: February 26, 2020, 9:21 AM IST
Hyderabad Metro: మెట్రో రైల్ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో తీపి కబురు. త్వరలో మరో రెండు మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రైళ్లకు సంబంధించిన ట్రయల్స్ ఇప్పుడు నడుస్తున్నాయని, మరో 10 రోజుల్లో వాటి సేవలు ప్రారంభించనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. దీంతో మరిన్ని సర్వీసులు నడపాలని, మెట్రో రైళ్ల వేగాన్ని పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు మార్గాల్లో 55 రైళ్లతో 1000 సర్వీసులు నడుపుతున్నారు. మరో రెండు రైళ్లు కూడా చేరితే 57 రైళ్లతో సర్వీసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే రైళ్ల వేగం కూడా పెంచడం ద్వారా కొన్ని మాసాల్లో సర్వీసుల సంఖ్య పెరిగే అవకాశముంది.

అలాగే మెట్రో సర్వీసులను పెంచేందుకు వీలుగా మెట్రో రైళ్ల వేగాన్ని పెంచాలని భావిస్తున్నారు. దీని కోసం కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్ఎస్) అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రో సర్వీసులను గంటకు 31 కి.మీ వేగంతో నడుపుతుండగా...దీన్ని 35 కి.మీలకు పెంచాలని భావిస్తున్నారు. ఆగస్టు మాసానికల్లా అనుమతులు రావచ్చని ఆశిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఫలితంగా రద్దీవేళల్లో రెండున్నర నిమిషాలకు ఒక సర్వీసును అందుబాటులోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గంలో మెట్రోవేగంపై ప్రయాణికులు అసంతృప్తితో ఉన్నారు. ఈ మార్గంలో ఎక్కువ మలుపులు ఉండడంతో సీఎంఆర్ఎస్ వేగ నియంత్రణ విధించింది.

హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణీకుల సగటు ప్రయాణం 10 కి.మీటర్లుగా ఉండగా...సగటు టిక్కెట్ ఖర్చు రూ.33గా ఉన్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు