హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్ మెట్రోలో మరో ఫెసిలిటీ... అద్దెకు బ్యాటరీ కార్లు

హైదరాబాద్ మెట్రోలో మరో ఫెసిలిటీ... అద్దెకు బ్యాటరీ కార్లు

మియాపూర్ మెట్రో దగ్గర బ్యాటరీతో నడిచే కార్లు (Image : Twitter / Zoomcar)

మియాపూర్ మెట్రో దగ్గర బ్యాటరీతో నడిచే కార్లు (Image : Twitter / Zoomcar)

Hyderabad Metro Rail : మియాపూర్ మెట్రోస్టేషన్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఏడాది కిందటే ప్రయోగాత్మకంగా తెచ్చినా, పూర్తిస్థాయిలో ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు.

హైదరాబాద్ మెట్రో స్టేషన్ల దగ్గర ఇప్పటివరకూ ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు, స్కూటీలూ సేవలు అందిస్తున్నాయి. తాజాగా అద్దె కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. బ్యాటరీతో నడిచే ఈ కార్లు... మియాపూర్ స్టేషన్ నుంచీ వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. వీటిని వాడుకుంటున్నవారు గంటకు రూ.40 అద్దె చెల్లిస్తున్నారు. మొదటిగా 25 మహీంద్రా కార్లను అందుబాటులోకి తెచ్చిన మెట్రో రైలు అధికారులు... త్వరలో మిగతా స్టేషన్లలోనూ ఈ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ కార్లను మియాపూర్ నుంచీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మాదాపూర్ ప్రాంతాలకు నడుపుతున్నారు. మియాపూర్ మెట్రోస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు తాము వెళ్లాలనుకునే ప్రాంతాలకు ఈ కార్లలో వెళ్లే వీలు కల్పించారు.


ఈ కార్ల కోసం జూమ్‌కార్‌ సంస్థతో మెట్రో రైలు అధికారులు డీల్ కుదుర్చుకున్నారు. పర్యావరణానికి హాని చెయ్యని ఈ కార్లను వాడుకోవాలనుకునేవారు ముందుగా... జూమ్‌కార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో తమ డ్రైవింగ్ లైసెన్స్‌ వివరాల్నీ, కార్డు ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత కార్‌లాక్‌ను అన్‌లాక్ చేసుకొనేందుకు వీలవుతుంది.


కారును ఎన్నిగంటలు వాడుకుంటారో యాప్‌లో ఆప్షన్ సెలక్ట్‌ చేసుకోవాలి. అందుకు చెల్లించాల్సిన డబ్బును ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా చెల్లించాలి. పూర్తిస్థాయి GPS సిస్టం కలిగి ఉన్న ఈ కార్లు చేరాల్సిన చోటికి చేరగానే లాక్ అవుతాయి. తిరిగి అక్కడి నుంచీ ఎవరైనా మియాపూర్ స్టేషన్‌కి రావాలనుకుంటే... వాటిని వాడుకునేందుకు వీలవుతుంది.


ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచీ రాకపోకలు సాగించేవారికి ఈ కార్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. రెగ్యులర్ క్యాబ్ సర్వీసుల కంటే తక్కువ ఖర్చుకే ఇవి లభిస్తున్నాయంటున్నారు ప్రయాణికులు. ఈ వాహనాల వల్ల, పర్సనల్ వెహికిల్స్ వాడకం తగ్గించేందుకు వీలవుతోందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇలా ఓ కొత్త ప్రయోగం చేయడం ద్వారా... మరింత మందికి మెట్రో సర్వీసులు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.

First published:

Tags: Hyderabad Metro, Metro, Telangana News, Telangana updates

ఉత్తమ కథలు