వారానికి అదనంగా 5,000 మంది... దూసుకుపోతున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు...

Hyderabad Metro Rail : హైదరాబాద్‌కి మెట్రో రైల్ సర్వీసులు వచ్చినప్పుడు... రేట్లు ఎక్కువగా ఉన్నాయి... ఈ రైళ్లు ఎవరూ ఎక్కరు అన్నారు కొందరు. అది పూర్తిగా తప్పని లెక్కలతో సహా రుజువు చేస్తున్నారు మెట్రో రైలు అధికారులు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 9, 2019, 12:20 PM IST
వారానికి అదనంగా 5,000 మంది... దూసుకుపోతున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు...
హైదరాబాద్ మెట్రో రైలు (File)
Krishna Kumar N | news18-telugu
Updated: June 9, 2019, 12:20 PM IST
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో... ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. ఈ మూడు దశల్లో అమీర్‌పేట స్టేషన్‌లో అత్యంత ఎక్కువ రద్దీ కనిపిస్తోంది. ఇక్కడి నుంచీ రోజూ 19 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఇది స్టేషన్... రెండు కారిడార్లను కలుపుతోంది కాబట్టి... ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత హైటెక్ సిటీ రూట్‌లో అత్యధికంగా రోజూ 18 వేల మంది ప్రయాణిస్తున్నారు. ఎల్బీ నగర్, మియాపూర్ వరకూ ప్రయాణిస్తున్నవారి సంఖ్య 16 వేల నుంచీ 14 వేల దాకా ఉంటోంది. శుక్రవారం ఒక్క రోజే కారిడార్ 1 (మియాపూర్ నుంచి ఎల్బీ నగర్)లో, కారిడార్ 3 (నాగోల్ నుంచి హైటెక్ సిటీ)లో రికార్డ్ స్థాయిలో 2.8 లక్షల మంది ప్రయాణించారు. ఇలా మెట్రో రైళ్లలో ప్రతి వారం అదనంగా 5 వేల మంది ప్రయాణిస్తున్నారు.

ప్రస్తుతం 1.39 లక్షల మంది ప్రయాణికులు స్మార్ట్ కార్డ్ ఉపయోగిస్తూ వెళ్తున్నారు. రెగ్యులర్ కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అమీర్‌పేటలో షాపింగ్ కోసం, రెస్టారెంట్లకు వెళ్లేవారు ఎక్కువగా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నందువల్ల అక్కడ ఎక్కువ రద్దీ ఉందని వివరించారు. సిటీలో సరదాగా ఎక్కడికైనా వెళ్లాలి అనుకునేవారు, టూరిజం ప్లేసెస్‌కి వెళ్లేవారు కూడా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఇయర్ మే నాటికి 66 కిలోమీటర్ల ట్రాక్స్ పూర్తయ్యాయి. MGBS దగ్గర 2599వ పిల్లర్ వేశారు. విశేషమేంటంటే... 2012లో మెట్రో ప్రాజెక్టు మొదలైంది. సరిగ్గా 2599వ రోజున... 2599వ పిల్లర్‌ను నిలబెట్టారు. తద్వారా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాను కవర్ చేసే 6 కిలోమీటర్ల మార్గం పూర్తైంది.

ప్రపంచంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న అతి పెద్ద మెట్రో ప్రాజెక్ట్ ఇదే. 2019 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇది పూర్తయ్యాక... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకూ దీన్ని విస్తరించేందుకు కొత్త ప్రాజెక్టు మొదలవ్వనుంది.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...