మరో గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro Rail : హైదరాబాద్ ప్రజలు మెట్రో రైళ్లను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాక... మెట్రో రైళ్ల వాడకం మరింత పెరిగింది. ఈ క్రమంలో త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్‌ రాబోతోంది.

news18-telugu
Updated: December 9, 2019, 7:19 AM IST
మరో గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో
మరో గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో
  • Share this:
Hyderabad Metro Rail : హైదరాబాద్ ప్రజలకు మెట్రోరైలు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రెండో మెట్రోరైలు కారిడార్‌ను అందుబాటులోకి తేబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌ ప్రజలకు మొదటి కారిడార్‌ కింద... మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ రూట్ అందుబాటులో ఉంది. మూడో కారిడార్‌... నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకూ ఏర్పాటైంది. మొదట ఇది హైటెక్‌ సిటీ వరకే నడిచినా ఈమధ్య మైండ్ స్పేస్ (రాయదుర్గం) వరకు పొడిగించారు. ఆ తర్వాత అక్కడి నుంచీ షటిల్ సర్వీసులు కూడా ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన రెండో కారిడార్‌ JBS నుంచి MGBS వరకు నిర్మించారు. ఈ రూట్‌పై రెండు వారాల నుంచి రైళ్ల ట్రయల్ జరుగుతోంది. ఇందులో సిగ్నలింగ్, పవర్, వేగం, ట్రాక్స్, స్టేషన్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఇదంతా కెనడాలోని థాలెస్ కంపెనీ పరిశీలిస్తోంది. మధ్యలో ఈ కంపెనీకి ఏంటి సంబంధం అన్న డౌట్ మీకు రావచ్చు. ఈ కంపెనీయే... మెట్రో రైళ్లు ఆటోమేటిక్‌గా వెళ్లేలా టెక్నాలజీని ఇచ్చింది. అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తయ్యాక... ఆ కంపెనీ అంతా ఓకే అంటూ... ఓ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ తర్వాత... హాల్‌క్రో అనే మరో ఇంటర్నేషనల్ కంపెనీ... అంతర్గత భద్రత ఎలా ఉంది? ఈ రూట్‌లో ట్రైన్స్ వెళ్తే... ఏమాత్రం సెక్యూరిటీ ఉంటుంది అనే అంశాల్ని పరిశీలిస్తుంది. ఆ కంపెనీ కూడా ఓ సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్లను ప్రభుత్వానికి చెందిన మెట్రోరైలు కమిషనర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. చివరిగా వాళ్లు వచ్చి రైళ్లలో ప్రయాణించి సంతృప్తి చెందితే... అప్పుడు వాళ్లు మరో సర్టిఫికెట్ ఇస్తారు. ఇలా నెలపాటూ... ఈ ప్రక్రియ జరుగుతుంది. అందువల్ల 2020లో రెండో కారిడార్ అందుబాటులోకి వస్తుందని మనం అనుకోవచ్చు.


కీలకమైన కారిడార్ : మొదటి, మూడో కారిడార్లు ఎంత ముఖ్యమైనవో, రెండోది కూడా అంతే కీలకమైనది. ఎందుకంటే... చాలా మంది ప్రయాణికులు జేబీఎస్‌కి వచ్చి... అక్కడి నుంచీ MGBSకి వెళ్లాలనుకుంటారు. ఇలాంటి సందర్భంలో... ఈ రూట్‌లో బస్సుల్లో వెళ్లాలంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ. అదే... మెట్రో రైలు ఎక్కితే... పావు గంటలో వెళ్లిపోవచ్చు. తద్వారా ఎంతో టైమ్ ఆదా అవుతుంది. అందుకే ఈ కారిడార్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 

Pics : అమాయక చూపుల అందాల రాశి తేజశ్విఇవి కూడా చదవండి :

 

క్యాట్‌వాక్ చేస్తూ కాలుజారిపడిన సుందరాంగి...

ఎన్‌కౌంటర్‌పై NHRC రెండ్రోజుల విచారణ... నెక్ట్స్ ఏంటి?

నేడు తెలంగాణ గవర్నర్ ప్రజాబాట... బీజేపీ వ్యూహం అదేనా?

నేడు లోక్‌సభలో పౌరసత్వ బిల్లు... ఆమోదం కోసం బీజేపీ విప్ వ్యూహం

పాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>