Metro Rail: ఒక్క గర్భిణీ కోసం నడిచిన హైదరాబాద్ మెట్రో రైలు... నెటిజన్ల ప్రశంసల జల్లు

Hyderabad Metro Rail: ప్రత్యేక పరిస్థితుల్లో ఓ గర్భిణీ కోసం ఏకంగా ఓ మెట్రో రైలును నడపడంతో... హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

news18-telugu
Updated: October 18, 2020, 11:50 AM IST
Metro Rail: ఒక్క గర్భిణీ కోసం నడిచిన హైదరాబాద్ మెట్రో రైలు... నెటిజన్ల ప్రశంసల జల్లు
Metro Rail: ఒక్క గర్భిణీ కోసం నడిచిన హైదరాబాద్ మెట్రో రైలు... నెటిజన్ల ప్రశంసల జల్లు
  • Share this:
Hyderabad Metro Rail: ఇది నిజంగా ప్రతి ఒక్కరి హృదయాల్నీ టచ్ చేస్తున్న అంశం. అది హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్న సమయం... ఏది రోడ్డో, ఏది బస్తీయో అంతా వాన మయం. రోడ్లన్నీ చెరువుల్లా మారిన వేళ... ఇక రోడ్లపై ప్రయాణం సాధ్యం కాదనుకున్న సమయంలో... ఓ గర్భిణీ కోసం... హైదరాబాద్‌ మెట్రో రైలు నడిచింది. నిజానికి అది మెట్రో రైలు నడిచే సమయం కాదు. అయినప్పటికీ... ప్రత్యేకంగా రైలును నడిపి ఆమెను సురక్షితంగా గమ్యానికి చేర్చింది. మెట్రో రైలు... హైదరాబాద్ ప్రజలకు అత్యవసర సమయాల్లో తోడుగా ఉటుందని నిరూపించింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ వైరల్ అయ్యింది. మెట్రో రైలు ఎండీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అక్టోబర్ 14 రాత్రి అత్యంత భారీ వర్షం కురిసిన విషయం మనకు తెలుసు. ఆ టైంలో LB నగర్‌-మియాపూర్‌ మార్గంలోని విక్టోరియా మెమోరియల్‌ (కొత్తపేట) స్టేషన్‌కు రాత్రి దాదాపు 10 గంటలకు ఓ గర్భిణి వచ్చింది. ప్రస్తుతం మెట్రో సర్వీసులను... ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకూ నడుపుతున్నారు. తనను మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు చేర్చాలని ఆమె అధికారులను వేడుకుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న మెట్రో సిబ్బంది... మానవత్వంతో స్పందించారు. ఉన్నతాధికారుల అనుమతితో ఆమె కోసమే ప్రత్యేకంగా మెట్రో రైలును నడిపారు.



ఎల్బీ నగర్‌ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు... 10:40కి మియాపూర్‌ చేరింది. అలా ఆమె సురక్షితంగా గమ్యాన్ని చేరింది. శుక్రవారం మెట్రోరైలు భవన్‌లో జరిపిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (HMR) ఎండీ NVS రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారాయి కాబట్టి... మెట్రో రైళ్లలో గ్రేటర్‌ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు.





ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తుఫానులా మారింది. ఎంతో మంది నెటిజన్లు దీన్ని తెలుసుకొని... మెచ్చుకుంటున్నారు. తాము చాలా సార్లు మెట్రో రైళ్లలో వెళ్తున్నామనీ... ఇకపైనా వెళ్తామని చెబుతున్నారు. ప్రతీదీ కమర్షియల్‌గా ఆలోచించే ఈ రోజుల్లో... మానవతా దృక్పథంతో ఆలోచించిన మెట్రో ఎండీ, సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 18, 2020, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading