శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అండర్ గ్రౌండ్ మెట్రో రైలు

Hyderabad Metro Rail : ఇప్పటివరకూ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో ట్రాక్స్ పై నుంచీ మాత్రమే వెళ్లాయి. కానీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే రూట్‌లో మాత్రం కొంత దూరం అండర్‌గ్రౌండ్ రూట్ ఉండబోతోంది. కొన్ని నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ మొదలవ్వనుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 2:46 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అండర్ గ్రౌండ్ మెట్రో రైలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచీ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి తొలిసారిగా మెట్రో రైలు మార్గం వేసేందుకు ప్లాన్ రెడీ అయ్యింది. మొత్తం రూట్ అంతా పిల్లర్ల పైనే సాగుతుంది. మూడు కిలోమీటర్లు మాత్రం అండర్ గ్రౌండ్‌‌లో ఉంటుంది. ఈ ప్రాజెక్టును ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ అని పిలుస్తున్నారు. ఇది తిన్నగా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కి కనెక్ట్ అవుతుందని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) మేనేజింగ్ డైరెక్టర్ N V S రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు దూరం, బడ్జెట్ వంటి అంశాల్ని పరిశీలిస్తున్నారు. ఐతే... ఈ ప్రాజెక్టుకి ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుందా లేక... ప్రస్తుత హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులాగా పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP)లా సాగుతుందా అన్నది త్వరలో తేలనుంది.

ప్రభుత్వం నుంచీ అనుమతులు, క్లియరెన్స్ రాగానే... కొన్ని నెలల్లో శంషాబాద్ మెట్రో రైలు వర్క్ ప్రారంభమవుతుంది. మొత్తం 31 కిలోమీటర్ల మార్గంలో ఈ ట్రాక్ ఉండబోతున్నట్లు తెలిసింది. ఇది నానక్‌రాంగూడ, నార్సింగి, టీఎస్ పోలీస్ అకాడెమీ, శంషాబాద్ గుండా సాగుతుందనీ... ఐటీ కారిడార్ నుంచీ మొదలవుతుందనే అంచనాలున్నాయి.

ఇటీవల అమీర్‌పేట-హైటెక్ సిటీ రూట్‌లో కారిడార్ 3లో (నాగోల్-శిల్పారామం) రైళ్ల సంఖ్యను పెంచారు. కీలక సమయాల్లో 4 నిమిషాలకు ఓ ట్రైన్ వెళ్లేలా చేశారు. మియాపూర్-ఎల్బీ నగర్ రూట్‌లోని కారిడార్-1లో... ప్రతి ఐదు నిమిషాలకు ఓ ట్రైన్ వస్తోంది. ఇంతకుముందు... ప్రతి ఆరేడు, నిమిషాలకు ఓ ట్రైన్ వెళ్లేది.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>