Hyd Metro: 7వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు పాటించాల్సిన రూల్స్

మెట్రో తరఫున తీసుకుంటున్న జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు.

news18-telugu
Updated: September 5, 2020, 4:55 PM IST
Hyd Metro: 7వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు పాటించాల్సిన రూల్స్
హైదరాబాద్ మెట్రో
  • Share this:
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 4 నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మెట్రో తరఫున తీసుకుంటున్న జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మెట్రోలో ప్రయాణికులు సామాజిక దూరం పాటించాలన్నారు. ‘మార్కింగ్ కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తాం. నగదు రహిత రూపంలో ఆన్ లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలి. ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. లేనివారు స్టేషన్ లో కొనుక్కోవాలి. ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం. నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతి. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుంది. మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్ తో రావాలి. 75% ఫ్రెష్ ఎయిర్ ట్రైన్ లో అందుబాటులో ఉంటుంది. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము. ప్రతి స్టేషన్ లో ఐసోలేషన్ రూంల ఏర్పాటు చేశాం.’ అని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేయనున్నారు. కంటైన్మెంట్ జోన్లు ఉండే ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు మూసి ఉంటాయి. ప్రతి రోజూ రాత్రి సమయంలో అన్ని స్టేషన్లను క్లీన్ చేస్తారు. లిఫ్ట్ బటన్లు, ఎస్కలేటర్లు, ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తరచూ శుభ్రపరుస్తారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 5, 2020, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading