Hyderabad Metro: ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మెట్రో.. ఆ పనికి అందరూ ఫిదా..

హైదరాబాద్ మెట్రో(ఫైల్ ఫొటో)

Hyderabad Metro: ఇటీవలే హైదరాబాద్ మెట్రో లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి గుండెను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద ఉన్న అపోలో ఆస్పత్రి వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఒక వ్యక్తికి హార్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    Hyderabad Metro: భాగ్యనగరానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్ మెట్రో కీర్తి దశ దిశలా వ్యాపిస్తున్నది. ఒక్కో దశను దాటుకుంటూ.. మన మెట్రో ఎన్నో మైలురాళ్లను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల మెట్రోలో చేసిన ఓ పని కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాదు.. వారి ప్రాణాలను కాపాడటంలో కూడా మెట్రో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నది.

    ఇటీవలే హైదరాబాద్ మెట్రో లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి గుండెను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద ఉన్న అపోలో ఆస్పత్రి వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఒక వ్యక్తికి హార్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా గుండెను అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేర్చడం కోసం మెట్రో అధికారులు రైళ్లను సమన్వయం చేసుకుని.. సకాలంలో ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.





    కాగా.. ఇదే విషయమై నార్వేయన్ ప్రతినిధి ఎరిక్ సొల్హెమ్ ట్విట్టర్ లో స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. మెట్రోల యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మెట్రో అధికారులతో పాటు ఆస్పత్రి సిబ్బందిని కూడా అభినందించారు. జీవితాలను ఎలా కాపాడుకోవాలో చెప్పారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఎరిక్ గతంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
    Published by:Srinivas Munigala
    First published: