Home /News /telangana /

HYDERABAD METRO EXTENSION FALLING BEHIND NO ANNOUNCEMENT FROM CENTRE GOVERNMENT SU

Hyderabad Metro Extension: వెనకబడుతున్న హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ.. కేంద్రం నోటి నుంచి మాటే కరువు..

మెట్రో రైలు  ప్రతీకాత్మక చిత్రం

మెట్రో రైలు ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ మెట్రోరైలు మొదటిదశ ప్రాజెక్టు పూర్తికావడంతో రెండోదశపై చర్చ జరుగుతున్నది. తొలి దశ కాకుండా మరో 100 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

    హైదరాబాద్‌ మెట్రోరైలు మొదటిదశ ప్రాజెక్టు పూర్తికావడంతో రెండోదశపై చర్చ జరుగుతున్నది. మొదటిదశలో నాగోల్‌ నుంచి రాయదుర్గంవరకు 29 కిలోమీటర్లు, ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు 29 కిలోమీటర్లు, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కిలోమీటర్లు పూర్తిచేసుకొని మొత్తం 69 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. ప్రభుత్వం నుంచి భూములు లీజ్‌కు తీసుకుని ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్.. రూ. 16వేల కోట్లకు పైగా ఖర్చుతో ఈ నిర్మాణం పూర్తిచేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో.. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టుగా అవతరించింది. ఈ క్రమంలోనే తొలి దశ కాకుండా మరో 100 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే కేంద్రం నుంచి మాత్రం హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.

    కొద్ద రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం తరఫున ప్రకటనలు వెలువడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం దాదాపు రూ. 4 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో ఫేజ్ వన్ విస్తరణను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే కోల్‌కతా మెట్రో కొత్త దశకు త్వరలో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బెంగళూరు, చెన్నై, కొచ్చి, నాగ్‌పూర్ మెట్రో రైలు సెకండ్ ఫేస్, నాశిక్ ఫస్ట్ ఫేజ్ మెట్రో రైలు నిర్మణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే వేల కోట్ల రూపాలయ నిధులను ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 702 కిలో మీటర్ల మెట్రో ప్రస్తుతం పనిచేస్తోందని.. మరో 1,016 కిలో మీటర్ల మెట్రో, రిజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ నెట్‌వర్క్ 27 నగరాల్లో నిర్మాణంలో ఉందని తెలిపారు. అయితే హైదరాబాద్ పేరును మాత్రం ప్రస్తావించలేదు.

    టైర్-2 నగరాల్లో కూడా మెట్రో..
    ఉత్తర, మధ్య రాష్ట్రాల్లో టైర్-2 నగరాలు కూడా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాలకు కోసం ప్రణాళికలు రచిస్తుండటం.. ప్రతిష్టాత్మక సమస్యగా మారిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాధాన్యతలు భిన్నంగా ఉన్నందును అడుగులు ముందకు పడటం లేదని అన్నారు.

    మెట్రో విస్తరణపై ముందుకే.. సీఎం కేసీఆర్
    అయితే అవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణపై ముందుకే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు(31 కిలోమీటర్లు) 9 వేల కోట్లతో మెట్రో నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. అయితే ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధంగా ఉందని.. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీనియర్ అధికారులు తెలిపారు. ఇక, ప్రతిపాదిత రెండో దశ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సాయం గానీ, అనుమతి గానీ కోరలేదు. అయితే మరి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రో రెండో దశ కోసం ప్రత్యేకంగా ఏమైనా కేటాయింపులు ఉంటాయా అనేది వేచి చూడాల్సి ఉంది.

    ఇక, మొదటి దశ మెట్రోకు సంబంధించి కేంద్రం రూ. 1,458 కోట్లకు వైబిలిటీ గ్యాప్ ఫంఢింగ్ ఇచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రెండో దశ నిధుల గురించి ప్రశ్నించినప్పుడు.. ఒర్జినల్ ప్లాన్ ప్రకారం మొత్తం నిర్మాణం పూర్తి చేయనివ్వండి అంటూ బదులిచ్చారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Central Government, Hyderabad Metro, Telangana

    తదుపరి వార్తలు