హోమ్ /వార్తలు /తెలంగాణ /

జేబీఎస్ టు సీబీఎస్ మెట్రో రైలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

జేబీఎస్ టు సీబీఎస్ మెట్రో రైలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro Rail : ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెటోమార్గాన్ని ప్రారంభించనున్నారు.

    హైదరాబాద్‌లో మెట్రో రైల్ కారిడార్ 3 ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెటోమార్గాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని మెట్రోరైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు పొందింది. ఈ విషయాన్ని తెలంగాణ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నాగోల్ – హైటెక్ సిటీ కారిడార్ 29 కిలోమీటర్లు, మియాపూర్ -ఎల్బీ నగర్ కారిడార్‌ 29 కిలోమీటర్లు ప్రస్తుతం మెట్రో రైలు నడుస్తుండగా… మూడో కారిడార్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 15 కిలోమీటర్ల వరకు అందుబాటులోకి రానుంది.

    జేబీఎస్ టు సీబీఎస్ మెట్రో రైలు ద్వారా నగరంలో మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. రెండు అతిపెద్ద బస్టాండులను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌ హైదరాబాద్ వాసుకే కాకుండా.. జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం హైదరాబాద్‌ వచ్చే వారికి ఎంతో ఉపయోగపడనుంది. ఈ కారిడార్‌తో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు కారిడార్‌గా హైదరాబాద్ మెట్రో రికార్డ్ సృష్టించనుంది. ఈ కారిడార్ ప్రారంభోత్సవం ద్వారా హైదరాబాద్ పాతబస్తీ మినహా అన్ని మార్గాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Hyderabad Metro, KTR