news18-telugu
Updated: May 15, 2020, 7:39 PM IST
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడి అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయుల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో మే 16 సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశముంది. తుఫాన్ 17 వరకు వాయువ్య దిశగా కదిలి.. తర్వాత మే 18 నుంచి 20 వరకు ఉత్తర ఈశాన్య దిశగా బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశముంది.
రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడకక్కడా కురిసే అవకాశముంది.
Published by:
Shiva Kumar Addula
First published:
May 15, 2020, 7:39 PM IST