Home /News /telangana /

Weather Update | తెలంగాణలో3 రోజుల పాటు వర్షాలు

Weather Update | తెలంగాణలో3 రోజుల పాటు వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

    రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడి అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన.. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న అండమాన్ సముద్రం ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయుల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సుమారుగా మే 15న దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా మే 16 నాటికి తుఫానుగా మారే అవకాశముంది. ఇది 17 వరకు వాయువ్య దిశగా కదిలి.. తర్వాత ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశముంది.

    ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియుడు నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మే 16న వచ్చే అవకాశముంది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్నాటక వరకు మధ్య మహారాష్ట్ర మరియు ఉత్తర ఇంటీరియర్ కర్నాటక మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Hyderabad, Rains, Telangana, WEATHER

    తదుపరి వార్తలు