బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు..

Rains: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 4, 2019, 6:52 AM IST
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. మళ్లీ గత రెండు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా క్యుములోనింబస్ మేఘాలతో.. క్షణాల్లో కారుమబ్బులు కమ్ముకొని కుండపోత వర్షం కురుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ఏళ్లుగా అరకొరగానే నిండే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా ఈ సారి నిండుకుండను తలపిస్తోంది. అటు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లు మళ్లీ మళ్లీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. బాసర నుంచి మొదలుకొని భద్రాచలం వరకు.. అటు ఏపీలోనూ గోదావరి నది కళకళలాడుతోంది.

అయితే, వర్షాలు మరోసారి కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అటు ఏపీలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>