హోమ్ /వార్తలు /తెలంగాణ /

చల్లని కబురు.. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

చల్లని కబురు.. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది.  అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. నైఋతి అరేబియా సముద్రం మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు మరియు మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించాయి. రాగల 48 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.

ఆగ్నేయ అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో సుమారుగా మే 31న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రాగల 72 గంటలలో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1న కేరళలోకి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.

పశ్చిమ మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 24 గంటలలో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది మరింత బలపడే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్ మరియు తూర్పు యెమెన్ తీరాల మీదుగా ప్రయాణించి తరువాత పశ్చిమ నైఋతి దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. పశ్చిమ విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడ మరియు తెలంగాణ మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు ఆదిలాబాద్, కోమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, జనగామ, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి మరియు మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఇక రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్ మరియు నారాయణపేట జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

First published:

Tags: Monsoon, Monsoon rains, Rains, Telangana

ఉత్తమ కథలు