Sai dharam Tej Effect: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ (Sai Dharam Tej Bike Accident)తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి (Madhapur Cable Bridge) వంతెనకు సమీపంలో తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. స్పోర్ట్స్ బైక్ (Sport Bike)పై వెళ్తున్న సాయితేజ్ రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపుతప్పి కిందపడ్డారు. అయితే లక్కీగా హెల్మెట్ (Helmet) ధరించడంతో సాయితేజ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని గాయాలపాలయ్యారు. ప్రస్తుతం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి (Appolo Hospital) లో అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదానికి రోడ్డుపై ఇసుక ఉండడంతో పాటు ఓవర్ స్పీడ్ (Over speed) కారణమని పోలీసులు భావిస్తున్నారు. కానీ సాయితేజ్ బాధ్యత గల పౌరుడిగా హెల్మెట్ ధరించి, తక్కువ స్పీడ్‌తోనే వెళ్తున్నారని ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు చెబుతున్నారు. రోడ్డుపై మట్టి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఎప్పటికప్పుడు రోడ్లను పరిశుభ్రంగా ఉంచాల్సిన జీహెచ్ఎంసీ (GHMC) నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి కారణమైన జీహెచ్ఎంసీపై కూడా కేసు పెట్టాలని కొందరు సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా వర్షకాలంలో ఇల మట్టి..ఇసుక రోడ్డుపై ఉంటే ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు జీహెచ్ ఎంసీ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోకి ప్రమాదం అవ్వడంతో ఈ విమర్శలు రెట్టిపయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ కళ్లు తెరిచింది. ప్రత్యేక చర్యలు చేపడుతూ రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు జీహెచ్‌ఎంసీ లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ సంస్థ చేస్తున్న నిర్మాణ పనుల వల్ల మట్టి, ఇసుక రోడ్లపై పడుతుండడంతో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు సత్వర చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: రేపు బెయిల్ రద్దవుతుందా..? సీఎం జగన్ మదిలో ఏముంది..?
హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోడ్లన్నింటీని ప్రస్తుతం క్లీన్ చేస్తున్నారు. ఇకపై ఎవరైనా నిర్మాణాల పేరుతో రోడ్లపై చెత్త వేసి వదిలిస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. మూడు నాలుగు రోజుల్లోనే ఆయన తిరిగి క్షేమంగా వస్తారని సినీ ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోకు యాక్సిడెంట్ అవ్వడంతో.. చిరంజీవికి ప్రముఖులంతా ఫోన్ చేసి.. ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చిరంజీవికి ఫోన్ చేశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC, Road accident, Sai Dharam Tej, Sai dharam tej accident