హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: షాకింగ్.. రోగి కిడ్నీలో ఏకంగా 1000 రాళ్లు.. ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదట

Hyderabad: షాకింగ్.. రోగి కిడ్నీలో ఏకంగా 1000 రాళ్లు.. ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదట

కిడ్నీ రిపోర్టు

కిడ్నీ రిపోర్టు

Hyderabad: కిడ్నీల్లో రాళ్లున్నాయని గ్రహించిన డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. అయితే అతని కిడ్నీల్లో రాళ్లు చూసి డాక్టర్లే ఖంగుతిన్నారు. ఎందుకంటే.. పదో పదిహేనో కాదు.. ఏకంగా వెయ్యి రాళ్లున్నాయి. వాటిని విజయవంతంగా తొలగించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు, హైదరాబాద్)

దేశంలో కిడ్నీ వ్యాధులు (Kidney Diseases)  ఎక్కువైపోయాయి. కిడ్నీలు ఫెయిల్ కావడం, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం తరచూ జరుగుతోంది. హైదరాబాద్‌లోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి.  పశ్చిమబెంగాల్‌ (West Bengal)కు చెందిన ఓ రోగి తరచూ కామెర్లు, కడుపు నొప్పితో బాధపడుతూ.. ఇటీవల హైదరాబాద్‌(Hyderabad)లో ఓ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కిడ్నీల్లో రాళ్లున్నాయని గ్రహించిన డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. అయితే అతని కిడ్నీల్లో రాళ్లు చూసి డాక్టర్లే ఖంగుతిన్నారు. ఎందుకంటే.. పదో పదిహేనో కాదు.. ఏకంగా వెయ్యి రాళ్లున్నాయి. వాటిని విజయవంతంగా తొలగించారు.

 CM KCR: రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్ .. మరో 10 రోజుల్లోనే..

కిడ్నీల ఫంక్షన్ దెబ్బతిని రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగిస్తూ ఉంటారు. సహజంగా రోగుల శరీరంలో ఒకటి రెండు రాళ్లు, మహా అయితే నాలుగైదు రాళ్లు ఏర్పడుతుంటాయి. వాటిని ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల  రోగి లివర్, కిడ్నీల నుంచి హైదరాబాద్ మెడికోవర్ హాస్పిటల్ డాక్టర్లు ఒకేసారి 1000 రాళ్లు తీశారు. 5 మిమీ నుంచి 50 మిమీటర్ల సైజులో ఉన్న 1000 రాళ్లను రోగి కిడ్నీ నుంచి తొలగించారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన రోగి మూడు సంవత్సరాలుగా కడుపు నొప్పి , కామెర్లులతో బాధపడుతున్నాడు. వీటి కారణంగా తరచుగా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ముందుగా  కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అతని కిడ్నీలో వేరుశెనగ గింజ పరిమాణం,నిమ్మకాయ సైజులో వివిధ పరిమాణాల్లో రాళ్లు గుర్తించారు.పెద్ద సంఖ్యలో రాళ్లు కారణంగా, అతను కోలాంగిటిస్ వ్యాధి భారిన పడ్డాడు. కోల్‌కతాలో ఎండోస్కోపిక్ చేయడానికి రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం లభించలేదు. దీంతో వారు హైదరాబాద్‌లోని మెడికోవర్ హాస్పటల్‌కు వెళ్లాలని రోగికి సూచించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని మెడికోవర్ ఆసుపత్రికి అతడు అడ్మిట్ అయ్యాడు.

డాక్టర్ కిషోర్ రెడ్డి ఈ కేసును స్వీకరించారు. టెస్ట్‌ల తర్వాత అతడి పిత్తాశయం, లివర్,  కిడ్నీలో 5 మిమీ నుండి 50 మిమీ వరకు అనేక రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. తరవాత నిర్వహించిన ఆపరేషన్ ద్వారా రోగి కిడ్నీ నుంచి 1000 రాళ్లు తీశారు. రోగికి నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో నిదానంగా కోలుకుంటున్నాడు. ఒక రోగి కిడ్నీ నుంచి ఒకేసారి 1000 రాళ్లు తీయడం ఇదే మొదటి సారని సర్జన్ కిషోర్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా మాత్రమే ఉంటాయన్నా తెలిపారు.

ఎవరికైనా జ్వరం,  కామెర్ల వంటి సమస్యల వస్తుంటే అప్రమత్తమవ్వాలి.   కడుపు నొప్పి కూడా వస్తే..ఇక ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది.

First published:

Tags: Hyderabad, Telangana