హైదరాబాద్ నిమ్స్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్న మెడికో ప్రీతి(Preethi) హెల్త్ కండీషన్ మరింత సీరియస్‌గా ఉంది. వైద్యులు ఎమర్జెన్సీ కేర్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నప్పటికి ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోగా ..బ్రెయిన్ డెడ్(Brain dead) అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఆమె బ్రతకడం చాలా కష్టమని తేల్చారు. ఈవిషయం తెలుసుకున్న ప్రీతి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ బిడ్డ బ్రతుకుతుందనే ఆశ నిన్నటి వరకు ఉందని..ఎప్పుడైతే ఆమె శరీరం రంగు మారడం, బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిసి కుమిలిపోతున్నారు.మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) సైతం ప్రీతి బ్రతకడానికి ఒక్క శాతం కూడా అవకాశం లేదని చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం నిమ్స్‌కి వెళ్లి ప్రీతిని పరిశీలించారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్(Raging)) జరగడం లేదనే మాట వాస్తవం కాదని..ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసిన సమయంలోనే చర్యలు కాలేజీ హెచ్‌ఓడీలు చర్యలు తీసుకుంటే పరిస్తితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు. మరోవైపు నిమ్స్ దగ్గర ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసు భద్రత పెంచారు.
ప్రీతి బ్రెయిన్ డెడ్..
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ ప్రీతి ప్రాణాలు కాపాడటం సాధ్యమయ్యే విషయం కాదని నిమ్స్ వైద్యులు తేల్చారు. శనివారం వరకు ఆమె హెల్త్ కండీషన్‌ని అబ్జర్వ్ చేస్తున్న వైద్యులు..ఆదివారం ఆమె బ్రెయిన్ డెడ్ అయిందన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత విషమంగా మారడంతో విషయాన్ని ప్రీతి తల్లిదండ్రులకు తెలియజేశారు. తమ బిడ్డ హెల్త్ కండీషన్ గురించి ప్రీతి పేరెంట్స్ మీడియాకు వెల్లడించారు. నిన్నటి వరకు బ్రతుకుతుందనే ఆశ ఉందని ..ఇప్పుడు డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పడం చూస్తుంటే తమకు బ్రతికిస్తారనే నమ్మకం లేదన్నారు. అయితే నిమ్స్ వైద్యులు ప్రీతి హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేయనున్నారు.
బ్రతకడం కష్టమే..
ఆదివారం మధ్యాహ్నం నిమ్స్‌కి వెళ్లిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రీతిని పరిశీలించారు. ఆమె హెల్త్ కండీషన్ , వైద్యులందిస్తున్న సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్. మెడికల్ కాలేజీలలో ఏంజరుగుతుందో తెలియడానికి ప్రీతి ఉదంతం ఒక సంఘటన మాత్రమే. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ లేదని చెబుతున్నప్పటికి అంతర్లీనంగా ఉందన్నారు. డాక్టర్ కావాలని గొప్ప కలలు కన్న బిడ్డ ప్రీతి వేధింపుల కారణంగా ఆసుపత్రిలో విగతజీవిగా మారిందన్నారు.
అన్నీ వ్యవస్థలు విఫలం...
తనను వేధిస్తున్నాడని సైఫ్ ఫై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవడం వల్లే ఇంత వరకు వచ్చిందన్నారు ఈటల రాజేందర్. పోలీసులు కూడా ప్రీతి తండ్రి కంప్లైంట్‌ని సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ప్రీతి విషయంలో అన్నీ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే. ప్రీతి సంఘటనపై సమగ్ర విచారన జరపాలి. దోషులపై కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana News