Home /News /telangana /

HYDERABAD MEDCHAL MALKAJGIRI DISTRICT RESIDENT WHO COMMITTED SUICIDE DUE TO FINANCIAL PROBLEMS SNR

Telangana: తండ్రి దశదిన ఖర్మకు డబ్బులు లేవని .. కొడుకు అంత పని చేశాడంటే ఎవరూ నమ్మరు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana:తాత్కాలికమైన ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేకపోయాడు ఓ వ్యక్తి. తండ్రి దశదిన ఖర్మ చేయడానికి డబ్బుల్లేకపోవడంతో అవమానంగా ఫీలయ్యాడు. కేవలం సమాజం ఏదో అనుకుంటుందని భావించి తననే నమ్ముకొని బ్రతుకుతున్నవాళ్లను దిక్కులేని వాళ్లను చేశాడు.

ఇంకా చదవండి ...
ఆర్ధిక ఇబ్బందులు మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఊపిరి తీసుకునేందుకు కూడా దారి తీస్తాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువ మంది అనుభవిస్తూ ఉంటారు. కొందరు భరిస్తూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తారు. తట్టుకోలేని వాళ్లు తనువు చాలిస్తూ ఉంటారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కూడా ఇదే తరహాలో ఓవిషాద సంఘటన జరిగింది. అది స్థానికుల్ని ఎంతగానో బాధించింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి(Medchal Malkajgiri)జిల్లా మూడు చింతల(Muduchintala) మండలం అద్రాస్‌పల్లి(Adraspalli)లో ఓ హృదయ విదారక సంఘటన జరిగింది. అద్రాస్‌పల్లి గ్రామానికి చెంది యాదయ్య(Yadayya)అనే వ్యక్తి వారం రోజు క్రితం చనిపోయాడు. ఆదివారం(Sunday)అనగా మే( May)29వ తేదిన దశదినఖర్మ నిర్వహించాల్సి ఉంది. తండ్రి చనిపోవడంతో అలాంటి బాధ్యత కొడుకుగా అతని కొడుకు నర్సింహ(Narsimha)పై పడింది.

డబ్బులు లేక దినం చేయలేకపోతే..
తండ్రి యాదయ్య దశదినఖర్మ నిర్వహించడానికి నర్సింహ దగ్గర డబ్బులు లేవు. దాంతో తనకు పరిచయమున్న చోట అప్పు కోసం ప్రయత్నించాడు. చేతిలో డబ్బులు లేకపోవడం, ఇస్తామన్న చోటి నుంచి కార్యక్రమం నిర్వహించడానికి డబ్బులు అందకపోవడంతో తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. బంధువులు కనీసం తండ్రి దినం కూడా పెట్టలేవా అని అంటారనే అవమానంతో కుంగిపోయాడు. అత్యంత సున్నితమైన విషయాన్ని భూతద్దంలో చూసుకొని చావు తప్ప వేరే దారి లేదనుకున్నాడు. అంతే ఉరివేసుకొని బలనవ్మరణానికి పాల్పడ్డాడు నర్సింహ.

ఆర్ధిక పరిస్థితులకు చావే సమాధానమా..
డబ్బులు లేని కారణంగా తండ్రి దశదిన ఖర్మ నిర్వహించలేకపోతున్నాననే బాధ, మనస్తాపంలో తనపై ఆధారపడిన వాళ్ల సంగతి ఏమిటనే విషయం మర్చిపోయాడు నర్సింహ. ప్రాణాలు తీసుకొని చనిపోవడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లు అయ్యారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న మామ వారం క్రితం చనిపోతే..ఆ బాధ నుంచి కోలుకోక ముందే ఇంటి బాధ్యతను నిర్వహిస్తున్న వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో నర్సింహ భార్య, ఇద్దరు పిల్లలు అయోమయంలో పడిపోయారు. పోయిన ప్రాణం తీసుకురాలేము..దశదిన ఖర్మ నిర్వహించలేకపోతున్నాననే చిన్న బాధను మనసులో పెట్టుకొని తననే నమ్ముకొని జీవిస్తున్న భార్య, పిల్లలకు అన్యాయం చేసి వెళ్లాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేవలం పది రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మగవాళ్లు చనిపోవడంతో ఇప్పుడు నర్సింహ కుటుంబం మగదిక్కు లేని సంసారంగా మారిపోవడం అందర్ని కలచివేస్తోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Suicide hanging, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు