12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున హైదరాబాద్‌లో..

మక్కా మసీదు పేలుళ్లకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాతబస్తీలో నేడు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ.. ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు.

news18-telugu
Updated: May 18, 2019, 10:57 AM IST
12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున హైదరాబాద్‌లో..
పేలుళ్ల అనంతరం మక్కా మసీదు బయట పోలీస్ భద్రత (REUTERS/Krishnendu Halder)
news18-telugu
Updated: May 18, 2019, 10:57 AM IST
2007 మే 18.. 12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున హైదరాబాద్‌లోని మక్కా మసీదు బాంబు పేలుళ్లతో రక్తసిక్తమైంది. హుజుఖానా ప్రాంతంలో అమర్చిన LED సెల్ ఫోన్ బాంబు పేలడంతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న మసీదులో భీతావహ దృశ్యం అలుముకుంది. అప్పటి ఘటనలో మొత్తం 14మంది మృతి చెందగా.. 58మందికి పైగా గాయపడ్డారు.

కేసులో ఇప్పటివరకు 100మందిని పైగా అరెస్ట్ చేసినా.. పేలుళ్లతో వారికి సంబంధం లేదని తేలింది. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ పరిధిలో విచారణలో ఉంది. మొత్తం 11మందిపై కేసు నమోదు చేయగా.. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వారందరినీ నిర్దోషులేనని ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని ఎన్ఐఏ భావించినప్పటికీ.. ఇప్పటివరకైతే అది కార్యరూపం దాల్చలేదు.

మక్కా మసీదు పేలుళ్లకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాతబస్తీలో నేడు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ.. ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. అనుమానిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులను మోహరించారు. అనుమానిత వ్యక్తులపై షాడో టీమ్స్ నిఘా ఏర్పాటు చేశాయి.

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...