రాష్ట్ర వ్యాప్తంగా మాంసం (meat) వినియోగం పెరుగుతోంది. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలను (sheep)దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. దీంతో ఇష్టానుసారంగా మాంసం అమ్మడం.. దీంతో క్వాలిటీ లేని మాంసంతోపాటు అధిక ధరలకు విక్రయాలు కొనసాగడంతో పాటు మాంసం అమ్మకాలు కనీసం అనుమతులు లేకుండా కూరగాయాలు అమ్మినట్టుగానే ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్నారు. ఇది కొన్ని సార్లు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణి చేపట్టింది. అయితే ఇలా పశుసంపదను పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల ఆరోగ్యం కూడ దృష్టి సారించింది. విచ్చల విడిగా మాంసం విక్రయించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మాంసం విక్రయించే దుకాణదారులను తన ఆధీనంలోకి తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా ప్రజలకు మేలైన మాంసంతో(best meat) పాటు సరసమైన ధరలకు అందించే అవకాశం ఉంటుందని యోచిస్తోంది.
ఇది చదవండి : ప్రియురాలి కోసం యజమానిని డబ్బు డిమాండ్... నిరాకరించడంతో...ఇలా చేశాడు.. !
ఇందులో భాగంగానే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కబేళాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిజోన్ పరిధిలో ఒక కబేళా, జిల్లాల్లో ఒకటి లేదా రెండు ఏర్పాటుచేయాలని భావిస్తోంది. వీటిని స్థానికంగా ఉండే మటన్ దుకాణాలకు(mutton shops) లింక్ చేసి.. అక్కడి నుంచే మాంసం సరఫరా చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే దుకాణదారులు ప్రభుత్వం అందించిన మాంసాన్నే విక్రయించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అమ్మాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా వినియోగదారులకు క్యాలిటి మాంసం అందడంతోపాటు, తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఇది చదవండి : ఆడపిల్ల పుడితే రూ.5,116 ఫిక్స్ డ్ డిపాజిట్.. వివరాలిలా..
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో(ghmc limits) సుమారు 10 వేలదాకా మటన్ షాపులు కొనసాగుతున్నాయి.. ఇందులో రెండువేల దుకాణాలను మాత్రమే ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలని భావిస్తున్నారు. ఇలా కేవలం మాంసం దుకాణాలే కాకుండా చేపలను కూడా కొని విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
తెలంగాణలో మత్స్యసంపద (fish)భారీగా పెరిగినప్పటికీ.. మత్స్యకారులకు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదనే అభిప్రాయంతో ఉంది. దుకాణాల ఆధునికీకరణకు అవసరమైతే బ్యాంకుల (banks)నుంచి రుణం కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ప్రతీ మాంసం దుకాణాల్లో రిఫ్రిజిరేటర్ ను అందుబాటులో ఉంచనున్నారు. ఇక, పట్టణం, నగరం అనే తేడా లేకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లకు(hotels) కూడా ప్రభుత్వం నుంచే సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయంతోపాటు ప్రజలకు కూడా మెరుగైన మాంసం కొనుగోలుకు అవకాశాలు ఉండనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderbad, Meat, Telangana News