హిందూ మత సంప్రదాయాల్లో మౌని అమవాస్య (Mauni Amavasya) కు ఎంతో విశిష్టత ఉంది. ఈసారి జనవరి 21 మౌని అమావాస్య వస్తోంది. అమావాస్య శనివారమే ఉండడంతో.. మౌని అమావాస్య కూడా శనివారమే జరుపుకుంటారు. మాఘమాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య నాడు దానం చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. అంతేకాదు నదులలో స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. శనిశ్చరి అమావాస్య సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానాలు చేస్తారు. అలాగే త్రివేణి సంగమం తీర్థయాత్రకు వెళ్లి పుణ్యస్నానం చేస్తే.. పుణ్యఫలం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈసారి మాఘమాసంలో ఐదు శనివారాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏలినాటి శని, శని ధైయా, ఇతర జన్మతః శని దోషాల (Saturn Defects) నుంచి విముక్తి లభించాలంటే.. ఈ శనివారం వచ్చే అమావాస్య రోజున భగవంతుడిని భక్తిశ్రద్ధలతో కొలవాలి. దానధర్మాలు చేయాలి. మాఘ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య జనవరి 21 ఉదయం 6.17 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది జనవరి 22 మధ్యాహ్నం 2.22 వరకు ఉంటుంది. ఉదయ తిథిని పురస్కరించుకుని... ఈనెల 21నే మౌని అమావాస్యను జరుపుకుంటారు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి దానం చేస్తే తరగని పుణ్యం లభిస్తుందట.
పురాణాల ప్రకారం... మౌని అమావాస్య నాడు సంగమ స్నానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే మాఘమాసంలో సంగమ స్నానం చేయడం ద్వారా విష్ణువు ప్రసన్నుడవుతారు. మౌని అమావాస్య మాఘమాసంలో మాత్రమే జరుగుతుంది. అందువల్ల ఈ రోజున గంగాస్నానం చేయడం వల్ల మనిషికి మోక్షం కలుగుతుంది.
శని దోషం పోవాలంటే ఈ పరిహారాలు చేయండి..
జ్యోతిష్య పండితుల ప్రకారం.. శని దోషం పోవాలంటే మౌని అమవాస్య రోజు పాత బట్టలు, బూట్లు, చెప్పులు పారేయండి. నల్ల నువ్వులు, నల్ల మినుములు, నూనె, దుప్పటి, నల్ల గుడ్డ, ఉక్కు పాత్ర, నీలమణి రాయి, గేదె-పాదాలను దానం చేయండి. తద్వారా శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astro Tips, Astrology, Mauni Amavasya, Shani effect