Hyderabad : రెండు రోజుల్లో పెళ్లి, అమ్మాయితో పాటు మధ్యవర్తి ఫోన్ కూడా స్విచాఫ్ అయింది..కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : పెళ్లి సంబంధం పేరుతో ఓ లేటు వయస్సు పెళ్లి కొడును మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. మాట్రిమోనియల్ సర్విస్ పేరుతో అమ్మాయిల ఫోటోలు పంపిన తర్వాత డబ్బులు గుంజి తీరా ముహుర్తాలు పెట్టుకున్నాక అందరి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి.

 • Share this:
  హైదరాబాద్‌కు(hyderabad) చెందిన ఓ వ్యక్తికి దాదాపు సగం జీవితం అయిపోయిది. ఈ క్రమంలోనే తనకు 49 సంవత్సరాల తర్వాత పెళ్లి(marriage) చేసుకోవాలని నిర్ణయించాడు. ఇందుకోసం ఓ నలుగురికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి మాట్రిమోనియల్ (matrimonial)సర్విసెస్‌ను సంప్రదించారడు.. అతను అనుకున్నట్టుగానే ఓ మాట్రిమోనియల్ సర్విసు నుండి పెళ్లి సంబంధం కుదిరింది దీంతో ఖుషి అయిన పెళ్లి కొడుకు చివరికి డబ్బులు పోయి నిరాశలోకి వెళ్లిపోయాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  తోడు ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. 49 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆశపడ్డాడు. తన అభీష్టానికి అనుకుణంగా ఓ మహిళ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడంతో ఫుల్ ఖుష్(feel happy) అయ్యాడు. వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలెట్టాడు. కట్ చేస్తే… రూ.4.89 లక్షలు వసూలు చేసిన పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులు, పత్తా లేకుండా పోయారు. దీంతో అతడు షాకయ్యాడు.

  వివరాల్లోకి వెళితే.. బాధితుడు రెండో పెళ్లి కోసం మూడు నెలల కిందట వివిధ మ్యారేజ్‌ బ్యూరోలను సంపద్రించాడు. రెండు నెలల క్రితం పింద్రోతు శివయ్య అనే వ్యక్తి బాధితుడు కాల్‌ చేశాడు. గుంటూరు జిల్లా(Guntur) తెనాలిలోని ఓ మ్యారేజ్‌ బ్యూరో నుంచి మాట్లాడుతున్నానంటూ వివరాలు చెప్పాడు. ఈ ఏడాది జులై 5న కొందరు మహిళల ఫోటోలు వాట్సాప్‌లో(watsapp) పంపించాడు. అయితే ఫోటోలు చూసిన పెళ్లికొడుకు తనకు నచ్చలేదని చెప్పడంతో అదే నెల 10న మరికొందరి ఫోటోలు పంపించాడు. అయితే అవికూడా అతనికి నచ్చలేదు.. చివరికి మరో రెండు రోజుల ఆగి కేవలం ఒక్క ఫోటో మాత్రం పంపాడు..

  ఇది చదవండి : దారుణం.. ముగ్గురు కూతుళ్లను చంపి.. తల్లి ఆత్మహత్య..


  దీంతో ఆ ఫోటో నచ్చింది. ఫోటో(photos) నచ్చడంతో అమ్మాయికి సంబంధించిన వివరాలను పంపించాలని అడిగాడు.. దీంతో పెళ్లికూతురిది విజయనగరం జిల్లా(vijayanagaram) అని.. వారికి మీరు నచ్చారని శివయ్య చెప్పాడు. ఆ తర్వాత పెళ్లి కొడుకు అయిన బాధితుడు, ఆమె పోన్లో మాట్లాడుకున్నారు. బాధితుడిని నమ్మించేందుకు అప్పుడప్పుడు ఆమె తల్లి కూడా అతడితో ఫోన్లో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఇద్దరికి పెళ్లి కుదిరింది.

  ఇక్కడే నిందితులు మోసానికి తెరలేపారు.. అమ్మాయికి తల్లిగారికి కొన్ని అప్పులు ఉన్నాయని .. పెళ్లి తర్వాత వాటితో ఇబ్బంది పడకూడదు అంటే.. ఆమె కుటుంబం చేసిన అప్పులు తీర్చాలని శివయ్య సూచించాడు. దీంతో లేటు వయస్సులో పెళ్లి కావడమే.. గ్రేట్‌గా ఫీల్ అయిన భాదితుడు అందులో కాబాయో భార్య కుటుంబానికి చెందిన అప్పులు కూడా కావడంతో అవి తీర్చేందుదకు బాధితుడు ముందుకు వచ్చాడు.. వాళ్లు డబ్బులు అడగడంతోనే పలు దఫాలుగా రూ.4.89 లక్షలు పంపించాడు.

  ఇది చదవండి : నాదే తప్పు... జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ రంగంలోకి..


  అనంతరం ఆగస్టు 25న రాత్రి 10.52 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫంక్షన్‌ హాల్‌ కూడా బుక్ చేశాడు. అనంతరం పెళ్లికి సంబంధించి ఏర్పాట్లపై కూడా చర్చించారు.. ఇంకా రెండు రోజుల్లో పెళ్లి అవుతుండగా ఏర్పాట్లతోపాటు తన కొత్త జీవితంపై కళలు కంటున్న సమయంలోనే బాధితుడికి పిడుగు లాంటీ విషయం తెలిసింది. పెళ్లికి రెండు రోజులు ఉందనగా.. మ్యాట్రిమోనియల్ సర్విసు ఇచ్చిన శివయ్యతో పాటు పెళ్లి కూతురు ఫోన్‌లు ఒక్కసారిగా స్విచ్‌ ఆఫ్ అయ్యాయి.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా... ఇదే స్విచ్ ఆఫ్(phone switched off) రావడంతో పెళ్లిరోజు వరకు వేచి చూసిన బాధితుడు తాను మోస పోయినట్టు తెలుసుకున్నాడు. దీంతో స్థానిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు
  Published by:yveerash yveerash
  First published: