హోమ్ /వార్తలు /తెలంగాణ /

Pub | Hyderabad : ఇప్పుడు పబ్‌లో రాత్రి లాడ్జ్‌లో మంటలు .. అసలేం జరుగుతోంది..?

Pub | Hyderabad : ఇప్పుడు పబ్‌లో రాత్రి లాడ్జ్‌లో మంటలు .. అసలేం జరుగుతోంది..?

Pub Fire(file photo)

Pub Fire(file photo)

Hyderabad|Pub fire: జూబ్లిహిల్స్ రోడ్‌ నెంబర్ 36లో ఉన్న జూబ్లీ 800పబ్‌లో ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం సమయం కావడంతో పబ్‌లో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలు కంట్రోల్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ట్విన్ సిటీస్‌ని ఫైర్ యాక్సిడెంట్స్ భయపెడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌(Hyderabad) నడిబొడ్డున ఉన్న ఓ పబ్‌(Pub)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లిహిల్స్ రోడ్‌ నెంబర్ 36లో ఉన్న జూబ్లీ 800పబ్‌(Jubilee 800 Pub)లో ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. పబ్‌ థర్డ్ ఫ్లోర్‌లో ఉండటం...అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మధ్యాహ్నం సమయంలో పబ్‌లో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. స్పాట్‌కి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జూబ్లీ 800 పబ్‌లో లోపల ఎవరూ లేకపోవడం, అంతా కాళీగా ఉన్నట్లుగా ఫైర్ సిబ్బంది తెలిపారు.

24గంటల్లోపే మరో ఫైర్ ...

పబ్‌లో మధ్యాహ్నం సమయంలో మంటలు చెలరేగడానికి కారణం ఏమై ఉండవచ్చని అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే పబ్ యజమాని పేరును నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. జంటనగరాల పరిధిలో 24గంటల్లోపే రెండు అగ్నిప్రమాదాలు జరగడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోమవారం రాత్రి 9గంటల దాటిన తర్వాత పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర్లోని ఓ లాడ్జిలో మంటలు చెలరేగి 8మంది మృత్యువాత పడ్డారు. ఈఘటన మరువక ముందే హైదరాబాద్‌ జూబ్లి పబ్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Fire Accident, Hyderabad news

ఉత్తమ కథలు