హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..భవనంలో చిక్కుకున్న ఇద్దరు..శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది

Hyderabad Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..భవనంలో చిక్కుకున్న ఇద్దరు..శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 6 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 6 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. దట్టమైన పొగలు రావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టు తెలుస్తుంది. భవనంలోని కిటికీలను పగలగొట్టి పొగను బయటకు పంపిస్తున్నారు. ప్రమాద సమయంలో భవనంలో ఆరుగురు ఉండగా నలుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ లోని సెకండ్ ఫ్లోర్ లో మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తుంది.

Income Tax Raids: హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ రైడ్స్..ప్లాట్ల విక్రయాలపై ఆరా..

ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో రామ్ గోపాల్ పేట పరిధిలోని నల్లగుట్ట వద్ద ఉన్న డెక్కన్ నైట్ వేర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మొత్తం 5 అంతస్తులు గల ఈ భవనంలో కింద కార్ల షోరూం, పైన బట్టల షాపు ఉంది. బట్టలు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. దీనితో పక్క భవనంలో ఉన్న కొంతమందిని అక్కడి నుంచి వేరే చోటుకు పంపించారు. ఇక బిల్డింగ్ మ్యాప్ తో అధికారులు ఎంట్రన్స్, ఎగ్జిట్ ను గుర్తించి సహాయక చర్యలు మళ్లీ ప్రారంభించారు.

Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్..BRS బహిరంగ సభపై బండి సెటైర్లు!

ఓ వైపు పోలీసులు, మరోవైపు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మాస్కులు, స్కై లిఫ్ట్ ద్వారా లోపలికి పంపించి ఆ ఇద్దరి కోసం వెతుకుతున్నారు. అయితే సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ కానిస్టేబుల్ అస్వస్థతకు గురి అవ్వడంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. మరికొన్ని గంటల వరకు సహాయక చర్యలు కొనసాగేలా పరిస్థితి నెలకొంది.

ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయక చర్యలను పరిశీలించారు. పెద్ద ఎత్తున మంటలు, పొగలు రావడంతో ఇబ్బంది కలుగుతుంది. మంటలు ఆరిపోయి మళ్లీ వస్తున్నాయి. భవనము చుట్టూ నుండి ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే కానీ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

First published:

Tags: Fire Accident, Hyderabad, Telangana

ఉత్తమ కథలు