అయ్యిందేదో అయిపోయింది. ఇకపై మాత్రం అలాంటి రోజులు రాకూడదు. ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవద్దని తెలంగాణ (Telangana) మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తోంది. రాజధాని ఢిల్లీ(Delhi),మహరాష్ట్ర (Maharashtra)లో మళ్లీ కరోనా కొత్త వేరియంట్ Corona new variantకేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా నిబంధనలు పాటించడం మరోసారి తప్పని సరి చేసింది. థర్డ్ వేవ్ తర్వాత మాస్కులు(Masks),శానిటైజర్లు (sanitizers) , భౌతికదూరం (physical distance) వంటి వాటి నుంచి విముక్తి పొందామని భావిస్తున్న రాష్ట్ర ప్రజలను మరోసారి హెచ్చరిస్తోంది. అప్పుడే కరోనా వైరస్ మన మధ్య నుంచి పూర్తిగా తొలగిపోలేదని ..అందువల్లే కేంద్రం వైద్య, ఆరోగ్యశాఖ సూచనల మేరకు జన సామర్ధ్యం అధికంగా ఉన్నటువంటి హైదరాబాద్(Hyderabad)లోని ప్రతి హాస్పిటల్స్(Hospitals), ప్రభుత్వ మెడికల్ సెంటర్స్(Government Medical Centers) లో మాస్కులు తప్పని సరిగా ధరించాలని సూచిస్తోంది. మాస్క్‌లు లేని వాళ్లను లోనికి అనుమతించమని పేర్కొంది. అలాగే కరోనా లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రులకు వస్తే ఆర్టీపీఆర్ టెస్ట్ చేసి ఫలితాలు వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉంచాలంటోంది. టెస్ట్‌లో కరోనా నిర్దారణ జరిగితే గాంధీ లేదా టిమ్స్‌కు తరలిస్తామంటోంది తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ. కొత్తగా ఎవరైనా కరోనా బారినపడిన, వైరస్ లక్షణాలు కనిపించినా, కేసులు పెరిగినా తట్టుకొనేందుకు వీలుగా దవాఖానల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు అధికారులు.
వైరస్ థ్రెంట్..
రాజధాని కేంద్రమైన హైదరాబాద్‌లోని ప్రతి హెల్త్ సెంటర్లో కరోనా రూల్స్ తప్పని సరిగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో, హైదరాబాద్‌లో కరోనా కేసులు కంట్రోల్లోనే ఉన్నప్పటికి ..భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈతరహా నిబంధనలు తప్పని చేస్తున్నట్లుగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్లు తెలిపారు. వైరస్ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఒకరిద్దరు ఉంటే వారి వల్ల ఎక్కువ మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉండటం కారణంగానే ఈ నిబంధనలు అమలు చేయాల్సి వస్తోందని తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మళ్లీ మాస్క్ మస్ట్..
వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తకపోయినప్పటికి నివారణ కోసం ఈతరహా నిబంధనలు అందరూ పాటించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కోరుతోంది. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు అధికారులు. కాబట్టి పబ్లిక్ ప్లేసులు, ఆసుపత్రులకు వెళ్లే వాళ్లు మాస్క్‌లు, భౌతికదూరం పాటించాలంటున్నారు. అలాగే తప్పని సరిగా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దని పదే పదే సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona alert, Corona mask, Telangana corona