Hyderabad: వెంటనే ఇంటికి రండి.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అసలేం జరిగిందంటే.

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ ఇంట్లో అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. అంతకు కొద్దిసేపటి క్రితమే భర్తకు కాల్ చేసింది.

  • Share this:
    ఓ మహిళ ఇంట్లో అనుమానస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. అంతకు కొద్దిసేపటి క్రితమే భర్తకు కాల్ చేసిన ఆమె.. వెంటనే ఇంటికి రండి.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని హస్మత్‌పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని కార్ఖానా ప్రాంతానికి చెందిన మల్‌పరాజ్ యాకయ్య పెద్ద కూతురు రవళి ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. రవళి.. వయసులో తనకంటే ఒక సంవత్సరం చిన్నవాడైన మహేశ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహం చేసుకుంది. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహేశ్.. హస్మత్‌పేట్‌లోని అంజయ్య నగర్‌కు చెందినవాడు.

    ఇక, పెళ్లి తర్వాత రవళి భర్త మహేశ్, అత్తమామలతో కలిసి హస్మత్‌పేట్‌లోనే నివాసం ఉంటుంది. ఇక, గురువారం రోజుకు మహేశ్.. ఫొటోలు తీయడం కోసం ట్యాంక్ బండ్ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో మహేశ్‌కు ఫోన్ చేసిన రవళి.. వెంటనే ఇంటికి రావాలని కోరింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో కంగారు పడిపోయిన మహేశ్ వెంటనే.. ఇంటి పక్కనే ఉండే శ్రావణికి ఫోన్ చేశాడు. తమ ఇంటికి వెళ్లి చూడాల్సిందిగా శ్రావణిని కోరాడు.

    దీంతో శ్రావణి.. మహేశ్ ఇంటికి వెళ్లి చూసింది. లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో.. స్థానికుల సాయంతో డోర్ తెరిచి లోపలికి వెళ్లింది. అయితే అప్పటికే రవళి ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు తెలిపారు. ఇక, స్థానికులు రవళి తండ్రికి కూడా సమాచారం అందజేశారు. ఇందుకు సంబంధించి రవళి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: