హోమ్ /వార్తలు /తెలంగాణ /

Extramarital Affair : డబ్బు కోసమే వివాహితతో సహజీవనం .. భర్తను వదిలొచ్చినందుకు చివరికి ఏమైందంటే..?

Extramarital Affair : డబ్బు కోసమే వివాహితతో సహజీవనం .. భర్తను వదిలొచ్చినందుకు చివరికి ఏమైందంటే..?

Extramarital-Affair

Extramarital-Affair

Extramarital Affair: తాత్కాలిక సంతోషం కోసం పరాయి వ్యక్తులతో పెట్టుకునే పరిచయాలు ప్రాణాలు తీస్తాయని హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన నిరూపించింది. వివాహిత అయి ఉండి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆమె పొందిన సుఖం కంటే పడిన శిక్షే అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తాత్కాలిక సంతోషం కోసం పరాయి వ్యక్తులతో పెట్టుకునే పరిచయాలు ప్రాణాలు తీస్తాయని హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన ఓ సంఘటన నిరూపించింది. వివాహిత అయి ఉండి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం(Extramarital Affair)పెట్టుకున్నందుకు ఆమె పొందిన సుఖం కంటే పడిన శిక్షే అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె శారీరక తృప్తి కోసం అతడికి దగ్గరైతే ..అతను మాత్రం ఆమెను అందుకోసమే లోబర్చుకున్నాడు. ఇదంతా చివర్లో తెలియడంతో భరించలేకపోయింది. తనకు జరిగిన అన్యాయం, మోసాన్ని తట్టుకోలేక చివరకు అంతటి కఠిన నిర్ణయం తీసుకుంది.

BJP vs TRS : దుబ్బాకైనా.. సిద్దిపేటైనా నేను రెడీ నువ్వు పోటీకి సిద్ధమా హరీష్‌రావుకు రఘునందన్‌రావు సవాల్డబ్బు కోసమే వివాహితకు వల..

ఆమెకు వివాహమైంది. భర్తతో కాపురం చేస్తోంది. సాఫీగా సాగుతున్న సంసారంలో మూడో వ్యక్తి ప్రవేశం ఆ కాపురాన్ని మూడు ముక్కలుగా చేసింది. ఫలితంగా ఓ వివాహిత బలవన్మరణానికి దారి తీసింది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్ డివిజన్‌ పరిధిలోని హైదర్‌గూడలో ఈఘటన చోటుచేసుకుంది. హైదర్‌గూడకు చెందిన నాగలతారెడ్డి అనే వివాహితకు సుధీర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతని మాటలకు ఆకర్షితురాలైన నాగలతారెడ్డి సుధీర్‌తో శారీరక సంబంధం కొనసాగించింది. అతనితో సహజీవనం చేసేందుకు భర్తను వదిలిపెట్టి గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటోంది. భర్తను విదిలి వచ్చిన మృతురాలిని సుధీర్‌ శారీరకంగా వాడుకున్నాడు. ఆమెతో తన మోజు తీర్చుకున్నాడు. చివరగా ఆమె దగ్గరున్న డబ్బులు తీసుకొని మోసం చేశాడు.

మోజు తీరిన తర్వాత మోసం..

సుధీర్‌ కేవలం తనను డబ్బు కోసమే శారీరక సంబంధం పెట్టుకున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది మృతురాలు నాగలతారెడ్డి. ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక..తిరిగి భర్తతో కాపురం చేయలేక మనస్తాపానికి గురైంది. పరాయి పురుషుడి చేతిలో మోసపోయిన పశ్చాత్తాపంతో గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాగలతారెడ్డి సూసైడ్ చేసుకున్న విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా సూసైడ్ లెటర్ బయటపడింది.

Telangana: వెహికల్ ఆపలేదన్న కోపంతో ఎస్‌ఐ కొట్టిన దెబ్బకు .. బైకర్ పరిస్థితి ఏమైందో తెలుసాభరించలేక ఆంటీ ఆత్మహత్య..

మృతురాలు నాగలతారెడ్డి సూసైడ్‌ లెటర్‌లో సుధీర్‌ అనే వ్యక్తి తనను మోసం చేశాడని, డబ్బుల కోసం తనను శారీరకంగా వాడుకొని తన మోజు తీర్చుకున్నాడని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Extra marital affair, Hyderabad, Telangana crime news

ఉత్తమ కథలు