HYDERABAD MARRIED WOMAN COMMITS TO SUICIDE HYDERABAD OVER CONFLICTS DETAILS HERE VB
Shocking: ఏడాదిన్నర క్రితం వివాహం.. ఆ ఒక్క కారణంతో ఆమె ఏం చేసిందంటే..
శ్వేత (ఫైల్)
Wife And Husband: ఎన్నో ఆశలతో కట్టుకున్న భర్తతో కలకాలం జీవించాలని ఆమె ఆశ పడింది. ఏడాదిన్న క్రితం పెళ్లి చేసుకున్న ఆ యువతి జీవితం అనుకోని రీతిలో మలుపుతిరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు చివరకు ప్రాణం తీసుకునే దాక వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వారిద్దరికి ఏడాదిన్న క్రితం వివాహం(Marriage) జరిగింది. పెళ్లి చేసుకున్న మొదట్లో వారి కాపురం అన్యోన్యంగా సాగింది. దాని ఫలితంగానే ఒక కూతురు(Daughter) కూడా పుట్టింది. తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ప్రతీ రోజు గొడవలు మొదలయ్యేవి. తప్పు మీరు చేశారంటే మీరు చేశారు అంటూ ఒకరినొకరు దూషించుకునే వారు. ఇంట్లో నిత్యావసర సరుకులు కొనే విషయం దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలనకు కోపం పెంచుకున్నారు.
ఇలా వీళ్ల గొడవ గురించి పెద్దలకు చెప్పినా.. వాళ్ల మాటలు విన్నట్టే విని.. తెల్లారి నుంచి షరా మాములే అన్నట్లు సాగింది. ఎప్పటికీ ఈ గొడవలు సద్దుమనగకపోవడంతో ఆ ఇల్లాలు తీవ్ర మనస్థాపానికి గురైంది. అతడు ఇంట్లో లేనిది చూసి ఆ గృహిణి ఫ్యాన్ కు తన చీరను కట్టి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఇలా తెలిపాడు.
హైదరాబాద్ లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ లో కరణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం సికింద్రాబాద్ పాటిగడ్డ అస్మత్‌పేట్ ప్రాంతానికి చెందిన శ్వేత(22)తో వివాహం జరిగింది. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు చోటు చేసుకోలేదు. తర్వాత కొన్నాళ్లకు వారికి కూతురు కూడా జన్మించింది. ఇటీవల కరోనా కారణంగా అతడు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. కూతురు పుట్టిన దగ్గర నుంచి గొడవలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతుండే వారు.
ఈ విషయం ఇరు కుటుంబసభ్యులకు తెలిసి ఇద్దరినీ మందలించారు. అయినా వారి తీరు మారలేదు. ఎక్కువగా ఎలాంటి కారణం లేకుండానే కరణ్ తన భార్యను కొట్టేవాడని స్థానికులు తెలిపారు. ఇలా ఇద్దరి మధ్య గొడవలు తగ్గకపోవడంతో మనస్థాపం చెందిన శ్వేత అతడు ఇంట్లో లేనిది చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు ప్రారంభించామన్నారు. క్షనికావేశంలో నిర్ణయాలను తీసుకోవద్దని.. ఇలా ఆత్మహత్యలు లాంటివి చేసుకుని తననే నమ్ముకొని ఉన్న కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దని పోలీసులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.