Home /News /telangana /

HYDERABAD MARKETS AND SHOPPING MALLS BECOME CROWDED DURING RAKHI FESTIVAL SNR BK

Rakhi Pournami 2022: వాస్తవానికి ఈ సంవత్సరం రాఖీ పండుగ జరుపుకోవాల్సిన రోజు ఎప్పుడంటే ..?

RAKHI POURNAMI

RAKHI POURNAMI

Rakhi Pournami 2022: రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో రాఖీ పౌర్ణమి సందడి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అన్నాచెల్లెళ్లు, అక్కా,తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ కావడంతో మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ రంగు రంగుల, వెరైటీ డిజైన్ల రాఖీలతో మెరిసిపోతున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  (M.Balakrishna,News18,Hyderabad)
  రక్షాబంధన్‌(Raksha Bandhan)...రాఖీ పౌర్ణమి(Rakhi pournami)ఎలా పిలుచుకున్న ..జరుపుకునేది అన్న, చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు కలకాలం తమకు రక్షణగా ఉండాలని, సోదరుడు ఎప్పుడూ సుఖ,సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జరుపుకునే పండుగ. హైదరాబాద్‌(Hyderabad)లో ఎక్కడ చూసిన రేఖీ పండుగ సందండే కనిపిస్తోంది. నగరంలోకి మార్కెట్లన్ని ఆడపడుచులతో కిటకిటాలాడుతున్నాయి. తమ సోదరుల కోసం మెరిసే రాఖీలు(Rakhis), మిఠాయిల ప్యాకెట్ల(Sweet Packets)కోసం వెతుకుతున్న మహిళలతో షాపింగ్‌ సెంటర్లు నిండిపోయాయి. బేగంబజార్(Begambazar), ఓల్డ్ సిటీ(Old City), కోఠి(Koti), జనరల్ బజార్‌(General Bazar)వంటి ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి సందడి స్పష్టంగా కనిపిస్తోంది.

  Fake Certificates : అమెరికా వెళ్ల‌డం కోసం ఎంత ప‌ని చేశాడో తెలిస్తే షాక్ అవుతారు  మార్కెట్‌లో రాఖీ పౌర్ణమి సందడి..
  సోదరుల చేతులకు కట్టే అనేక డిజైనర్‌ రాఖీలు ఇప్పుడు మార్కెట్‌లో ఆడపడుతుల్ని ఆకర్షిస్తున్నాయి. పండుగ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రాఖీ స్టాల్స్‌ సిటీలో చాలా చోట్ల ద‌ర్శ‌న‌మిస్తోన్నాయి. ప్రజెంట్ జనరేషన్‌ టేస్ట్‌కి తగ్గట్లుగా అనేక రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా పూర్తి స్థాయిలో రాఖీ పండుగ జరుపుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గిపోవడం, నిబంధనలు తొలగించడంతో మార్కెట్లు అన్నీ మహిళలతో కిటకిటలాడిపోతున్నాయి.  రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో..
  అన్న, తమ్ముళ్ల చేతికి కట్టే రాఖీని సాదాసీదాగా కాకుండా విభిన్న సందేశాలను కలిగి ఉన్న రాఖీలు కూడా ఈ సారి మార్కెట్‌లోకి అందరికీ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది త‌మ‌ సోదర‌లుకి సందేశాలతో కూడిన రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. సాంప్రదాయ, ఫ్యాన్సీ రాఖీలు కూడా మంచి గీరాకి ఉంద‌ని కోఠీలో ఒక స్టాల్ యజమాని న్యూస్18కి చెప్పారు. మ‌రో వైపు నగరంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న గ‌త‌ సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మకాలు బాగానే ఉన్నాయని మరో స్టాల్ యజమాని శ‌ర్మ‌ చెప్పారు. ప్ర‌స్తుతం త‌న షాప్ లో 150 నుండి 1,000 వరకు రాఖీలను అందుబాటులో ఉంచాన‌ని తెలిపారు. చాలా మంది ఇత‌ర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సోదరులకు వాటిని పంపడం కోసం గ‌త నెల నుంచే రాఖీ అమ్మ‌కాలు బాగా ఉన్నాయని చెబుతున్నారు.

  Telangana | BJP MLA Rajasingh : నా శరీరంలో బుల్లెట్లు దిగడం ఖాయం .. నన్ను కచ్చితంగా చంపేస్తారు : రాజాసింగ్‌ సంచలన కామెంట్స్  అందుబాటులో వెరైటీ రాఖీలు, గిఫ్ట్‌లు..
  మహిళలే కాదు, చాలా మంది పురుషులు కూడా తమ సోదరీమణుల కోసం బహుమతులు కొనడానికి మార్కెట్లల‌ను జ‌ల్లెడ‌ప‌డుతున్నారు. చాక్లెట్లు, ప్రత్యేకమైన గిఫ్ట్ సెట్‌లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు అమ్మే షాపులు కిట‌కిట‌లాడుతున్నాయి. మరోవైపు కొందరు ఇత‌ర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సోదరి సోదరీమణులకు రాఖీలు, స్వీట్లు, బహుమతులు పంపడానికి ఆన్‌లైన్‌ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆన్ లైన్ లో చాలా కంపెనీలు ఈ సేవ‌లు అందిస్తోన్నాయి. మ‌రో వైపు కొంత మంది ఈ వేడుక జ‌రుపుకోవ‌డ‌మేకాకుండా ఒక చ‌క్క‌టి మేసెజ్ ఇవ్వాల‌నే ఉద్దేశంతో 2017లో హైదరాబాదీ దంపతులచే స్థాపించబడిన ప్లాన్ ఎ ప్లాంట్, మొక్కల విత్తనాలతో కూడిన రాఖీలను త‌యారు చేస్తూ వాటి మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే, అయితే రాఖీ పండుగ జరుపుకునే రోజుపై చాలా మందిలో గందరగోళం నెలకుంది, చాలా మంది పూజారులు రాఖీని ఆగస్టు 11 రాత్రి 8:51 గంటల తర్వాత జ‌రుపుకోవాల‌ని చెబుతుంటే మ‌రి కొంత మంది మాత్రం ఆగస్టు 12 ఉదయం 7:16 గంటల జ‌రుపుకోవాల‌ని చెబుతున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Raksha Bandhan, Telangana News

  తదుపరి వార్తలు