హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్ లో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్..మహారాష్ట్రకు తరలింపు

హైదరాబాద్ లో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్..మహారాష్ట్రకు తరలింపు

మావోయిస్టులు ( ప్రతీకాత్మక చిత్రం)

మావోయిస్టులు ( ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో మావోయిస్టుల అరెస్ట్ కలకలం రేపింది. నగరంలో ఉంటున్న ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో మావోయిస్టుల అరెస్ట్ కలకలం రేపింది. నగరంలో ఉంటున్న ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు (Maoists) లు మధుకర్ చిన్నాతో పాటు ఆయన భార్య శ్యామలను పోలీసులు అరెస్ట్ చేసి గడ్చిరౌలీకి తరలించారు. వీరు హైదరాబాద్ లోనే వేర్వేరు చోట్ల పని చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా పలు దాడుల్లో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. అంతేకాదు వీరిపై రూ.10 లక్షల రివార్డ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Raja Singh: నిన్ను చంపేస్తాం... రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్.. !

2005లో మహారాష్ట్రలోని గడ్చిరౌలి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఈ ఇద్దరు దంపతులు హయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఇందులో మధుకర్ చిన్నా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. ఇక అతని భార్య శ్యామల ఓ షాపింగ్ మాల్ లో సేల్స్ ఉమెన్స్ గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ తో వారిద్దరిని సోమవారం అరెస్ట్ చేసి గడ్చిరౌలికి తరలించారు. కాగా ఈ ఇద్దరు కూడా పలు దాడుల్లో కీలక నిందితులుగా ఉన్నారు. అయితే ఇన్నిరోజులుగా తమ ఉనికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కానీ చివరకు వారిద్దరూ మావోస్టులు అని సమాచారం అందడంతో పోలీసులు అరెస్ట్ చేసి మహారాష్ట్రకు తరలించారు.

పవన్ కళ్యాణ్‌కు కేసీఆర్ ఆఫర్.. వార్తలపై పృథ్విరాజ్ కీలక వ్యాఖ్యలు..!

ఇదిలా ఉంటే తెలంగాణ - ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో జనవరి 12న జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో హిడ్మా (Hidma) మృతిపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ]ఎన్ కౌంటర్ లో హిడ్మా (Hidma) చనిపోలేదని సేఫ్ గానే ఉన్నారని మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో ఈ లేఖ రిలీజ్ చేశారు. హిడ్మా చనిపోయారన్న వార్తల్లో నిజం లేదు. ఆయన సేఫ్ గానే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. దక్షిణ బస్తర్ లో తెలంగాణ , ఛత్తీస్ ఘడ్ పోలీసులు డ్రోన్ లు, హెలికాఫ్టర్ ద్వారా దాడులు చేశారు.  గతేడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ దాడుల కారణంగా ప్రజలు, రైతులు వారి పనులకు వెళ్లడానికి జంకుతున్నారు.

ఇక తాజాగా ఇద్దరు మావోస్టుల అరెస్ట్ హైదరాబాద్ లో కలకలం రేపింది.

First published:

Tags: Crime, Hyderabad, Maoist, Telangana

ఉత్తమ కథలు