హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad | Heavy rain : 2గంటల పాటు కురిసిన వర్షానికి జంటనగరాలు జలదిగ్భందం..వీడియోలు చూడండి

Hyderabad | Heavy rain : 2గంటల పాటు కురిసిన వర్షానికి జంటనగరాలు జలదిగ్భందం..వీడియోలు చూడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad | Rain: గంట, రెండు గంటల పాటు కురిసిన వర్షానికి జంటనగరాలు తడిసి ముద్దైపోయాయి. వర్షపునీరు రోడ్లపైకి చేరడంతో చెరువులుగా మారాయి. కాలనీలు, ఇళ్లను వర్షపు నీరు చుట్టుముట్టడంతో రోడ్లపైకి వచ్చిన వాహనదారులు, ఇళ్లలో ఉన్న నగరవాసులు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.

ఇంకా చదవండి ...

హైదరాబాద్‌(Hyderabad) నగరవాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. కేవలం గంటల పాటు కురిసిన వర్షానికే రోడ్లు వాగులుగా , కాలనీలు చెరువులుగా మారిపోయాయి. ముఖ్యంగా శుక్రవారం(Friday)కురిసిన కుండపోత వానకు నగరంలో చాలా చోట్ల పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. ఒక ప్రాంతం అని లేదు..సిటీలోని చాలా చోట్ల వర్షానికి రహదారులు బ్లాక్ అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, నగరవాసులు గమ్యస్థానాలకు చేరుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది.

Hyderabad: భారీ వర్షాలతో ఒక్కసారిగా పెరిగిన డెంగీ కేసులు.. తక్షణమే ఈ జాగ్రత్తలు పాటించండి..భారీ వర్షానికి భాగ్యనగరం చిత్తడి..

శుక్రవారం మధ్యాహ్నం మొదలుపెట్టిన వర్షం సాయంత్రం వరకు దంచి కొడుతూనే ఉంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్ రెండు ప్రాంతాల్లో ఎడాతెరిపి లేకుండా పడ్డ వానకు హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు, బస్తీలే కాదు బంజారాహిల్స్ , జూబ్లిహిల్స్ , గచ్చిబౌలి, రాయదుర్గం, మణికొండ, టోలీచౌకి, ఫిల్మ్‌నగర్, మణికొండ, నిజాంపేట, మూసాపేట వంటి రద్దీ, సంపన్నులు ఉండే ఏరియాలు జలమయంగా మారాయి. ప్రధాన రోడ్లపైనే మోకాళ్లకుపైగా నీరు ప్రవహిస్తు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు వర్షపు నీటిలోని చిక్కుకొని మొరాయించాయి. బేగంపేటలోని గంగవిహార్ కాలనీలో ఇళ్లలోంచి బయటకు రాలేనంతగా వర్షపు నీరు ఇళ్లను చుట్టుముట్టింది.

సిటీలో చెరువుల్లా మారిన రోడ్లు..

వరుణుడి ప్రతాపానికి హైదరాబాద్‌లోని క్లాస్ ఏరియాలే కాదు ..సికింద్రాబాద్‌లోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సుమారు రెండు గంటలకుపైగా వర్షం దంచి కొట్టడంతో మోకాళ్ల లోతుకుపైగా వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు సగం వరకు నీట మునిగాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జంటనగరాల్లో సేమ్ సిస్ట్యూవేషన్ ..

సిటీ మధ్యలోనే కాదు శివార్లలో కూడా భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఫేస్ చేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్‌పేట్‌ హెచ్ బి కాలనీ నాలుగో డివిజన్‌లో గంట సేపుగా కురిసిన కుండపోత వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రోడ్లపై చిక్కుకుపోయిన వాహనాలు..

చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎటు చూసినా రోడ్లపై నీరు చేరడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

పని ఉంటే తప్ప రోడ్లపైకి రావొద్దు..

వర్షానికి చాలా రోడ్లు దెబ్బతినడం, వర్షపునీరు నిలిచిపోయిన నేపధ్యంలో జీహెచ్‌ఎంసీ నగరవాసులను అప్రమత్తం చేసింది. స్కూల్స్‌కు పంపే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని...అవసరం లేకపోతే రోడ్లపైకి వాహనాలు తీసుకొని రావద్దంటూ హెచ్చరించింది. మరోవైపు మరమ్మతు పనులు చేపడుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad Heavy Rains, Telangana News

ఉత్తమ కథలు