హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS RTC : టీఎస్‌ ఆర్టీసీలో వీఆర్ఎస్‌ దరఖాస్తుల పరిశీలన .. పదవీ విరమణకు యాజమాన్యం అనుమతి

TS RTC : టీఎస్‌ ఆర్టీసీలో వీఆర్ఎస్‌ దరఖాస్తుల పరిశీలన .. పదవీ విరమణకు యాజమాన్యం అనుమతి

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

TS RTC: టీఎస్ ఆర్టీసీలో వీఆర్ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించనుంది సంస్థ. కొత్త వీఆర్‌ఎస్‌ దరఖాస్తులను స్వీకరించి అర్హులందరికీ అవకాశం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యం డిపో మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఎస్ ఆర్టీసీ(TS RTC)లో వీఆర్ఎస్‌(VRS)కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందర్నీ స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించనుంది సంస్థ. జూలై(July) 31 వరకు వచ్చిన దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు కొత్తగా చేసుకునే దరఖాస్తులను పరిశీలించి వీఆర్‌ఎస్‌కు అనుమతించాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది. వీఆర్‌ఎస్‌ దరఖాస్తులను స్వీకరించి అర్హులందరికీ అవకాశం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యం డిపో మేనేజర్ల(Depot Managers)కు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు ఇక నుంచి వీఆర్‌ఎస్‌ను నిరంతరప్రక్రియగా పరిగణించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

Boora Narsaiah Goud: TRS మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ చేరుతోంది ఆ పార్టీలోనే .. ఆ రోజే కండువా మార్చుకోవడం ఫిక్స్

వీఆర్ఎస్‌కు లైన్ క్లియర్ ..

వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ప్రత్యేక ప్యాకేజీ లేకపోవడంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల మేరకే వీఆర్ఎస్‌పై వెళ్లే వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించనుంది ఆర్టీసీ యాజమాన్యం.నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తూ పురోగాభివృద్ధి సాధిస్తోంది. అలాగే ఆర్టీసీలో చేపడుతున్న నూతన సంస్కరణల్లో భాగంగానే వయోభారం, అనారోగ్యంతో విధులు నిర్వహించలేకపోతున్న డ్రైవర్లు, కండక్టర్లను వీఆర్‌ఎస్‌ అనుమతించడం ద్వారా వేతనాల భారం తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావించారు. అందులో భాగంగానే ఈనిర్ణయం తీసుకున్నారు. ఇక మూడు నెలల్లో కారుణ్య నియామకాలను కూడా భర్తీ చేయాలని యాజమాన్యం చూస్తోంది.

ప్రయోజనాలను బట్టి నిర్ణయం..

టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇచ్చినట్టుగా వీఆర్‌ఎస్‌ ప్యాకేజీ ఇస్తే ఆర్టీసీలో పని భారం తట్టుకోలేకపోతున్న మరికొంత మంది సైతం వీఆర్ఎస్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులు రోజూ ఏకధాటిగా పది గంటల పాటు సిటీ బస్సులు నడుపలేక నరకయాతన అనుభవిస్తున్నారని..అలాంటి వాళ్ల సంఖ్య దాదాపు 10వేల మంది వరకు ఉంటారని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.

Telangana: AICC అధ్యక్ష ఎన్నికల వేళ గాంధీభవన్ లో గందరగోళం..మరోసారి బయటపడ్డ కాంగ్రెస్ వర్గపోరు

మొగ్గు చూపని కార్మికులు..

తెలంగాణ రోడ్డు రవాణ సంస్థలోని ఉద్యోగులకు రెండు పీఆర్‌సీలు, 5 డీఎలు బకాయిలు రావలసి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో యజమాన్యం స్పష్టత ఇచ్చే వరకు వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు చేయవద్దని, చేస్తే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని వారు చెబుతున్నారు. 52ఏళ్లు పైబడిన వాళ్లంతా వీఆర్ఎస్‌ దరఖాస్తుకు అర్హులేనని ప్రకటించినప్పటికి పీఆర్‌సీ, డీఏపై క్లారిటీ రాకపోవడంతో వీఆర్ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గినట్లుగా తెలుస్తోంది.

First published:

Tags: Telangana News, Tsrtc

ఉత్తమ కథలు