హోమ్ /వార్తలు /తెలంగాణ /

CID Officer-Women: హలో.. నేను సీఐడీ అధికారిని.. నువ్వు నాకు కావాలి.. ఎక్కడకు రమ్మంటావ్..

CID Officer-Women: హలో.. నేను సీఐడీ అధికారిని.. నువ్వు నాకు కావాలి.. ఎక్కడకు రమ్మంటావ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CID Officer-Women: మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా అత్యాచారాలు, ఈవ్ టీజింగ్ లు, హత్యలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు.

ఇంకా చదవండి ...

మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా అత్యాచారాలు, ఈవ్ టీజింగ్ లు, హత్యలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు.

Stored Chicken-Mutton: చికెన్, మటన్ కోసం వెళ్తున్నారా.. కాస్త ఆగండి.. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి..


ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగ చోటు చేసుకన్న ఈ ఘటనలో ఓ అమ్మాయిని పార్టీలో చూసి.. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు, వీడియోలు పంపాడు. అంతే కాకుండా.. తాను సీఐడీని అంటూ ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన రాచకొండ పరిధిలో చోటు చేసుకుంది. రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పూర్తి సమాచారం ఇలా ఉంది. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన బాధితురాలికి గత నెల 29న ఓ కొత్త నంబర్ నుంచి ముందుగా వాట్సాప్ లో సందేశం వచ్చింది. తెలిసిన వారే కదా అని ఆమె చూసి వదిలేసింది.

Wife: ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేసినందుకు.. పక్కింటి యవకుడిని ఇంటికి రమ్మంది.. చివరకు..


తర్వాత వీడియో కాల్స్ చేయడం ప్రారంభించారు. తీరా అటు వైపు చూస్తే.. ఆమెకు అతడు ఎవరో తెలియదు. ‘నిన్ను ఓ వేడుకలో చూశా.. అప్పుడే బాగా నచ్చేశావు.. నీతో గడపాలని ఉంది. ఎక్కడికి రావాలో చెప్పు’ అంటూ అటువైపు నుంచి ఓ వ్యక్తి వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించం మొదటు పెట్టాడు. ఆమె వట్సాప్ లో ఆ వీడియోలు, ఫొటోలు చూడగానే వెంటనే డిలీట్ చేసేవాడు. దీంతో ఆమె ఎవరు నువ్వు.. తనను ఎందుకు ఇలా వేధిస్తున్నావ్ అంటూ నిలదీసింది. తాను సీఐడీ విభాగంలో ఉన్నతాధికారిని అని చెప్పాడు. అలా చెప్పిన కొంతసేపటికి యూనిఫాంలో వీడియో కాల్ చేశాడు.

Bigg Boss: షాకింగ్.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్.. చివరకు ఏమైదంటే..


ఒక్కసారిగా బాధితురాలు కంగారు పడిపోయింది. ఇక లాభం లేదని ఆ నంబర్ ను బ్లాక్ చేసింది. అయినా అవతలి వ్యక్తి వదల్లేదు. తన నంబర్ నే బ్లాక్ లో పెడుతుందా అంటూ ఇంకా ఆగ్రహంతో ఊగిపోయాడు. వేరే నంబర్ నుంచి మళ్లీ ఇలానే అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించాడు. అంతే కాకుండా మళ్లీ వీడియో కాల్స్ కూడా చేయడం ప్రారంభించాడు. తన నంబర్ నే బ్లాక్ చేస్తావా అంటూ ఈ సారి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published:

Tags: Crime, Crime news, Hyderabad, Hyderabad biryani

ఉత్తమ కథలు