హైదరాబాద్ లో సైదాబాద్ సింగరేణి కాలనీలో నల్గొండ జిల్లా చందంపేట మండలానికి చెందిన ఓ కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. వారి పెద్దమ్మాయి(5) రోజులాగానే ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. స్థానిక మసీద్, చర్చిలో మైకుల ద్వారా ప్రచారం చేయించారు. అయినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సింగరేణి కాలనీలో గాలించారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించినా ఫలితం లేకపోయింది. అయితే వాళ్ల ఇంటి పక్కనే ఉంటున్న వ్యక్తి పేరు రాజు. అతడు చెడు వ్యసనాలకు అలవాటు పడి ల్లర దొంగతనాలు పాల్పడేవాడు.
రోజు మద్యం సేవించి భార్య, పిల్లల్ని వేధించేవాడు. దీంతో కొద్ది రోజుల క్రితం అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత కొన్ని రోజులకు అతడి తల్లి కూడా మరణించింది. దీంతో ఒంటరిగా ఉంటున్న అతడు కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూజల్సాలు చేస్తూ తిరుగుతుండేవాడు. చిన్నారి నాయనమ్మకి పక్కింట్లో ఉండే రాజుపై అనుమానం వచ్చింది. అనుమానం బలపడటంతో ఉదయం 12 గంటల ప్రాంతంలో తాళం పగలగొట్టి చూడగా పరుపులో చిన్నారి శవమై కనిపించింది. ఆమె అత్యాచారం చేసి.. చివరకు హత్య చేసి శవాన్ని పరుపులో పెట్టి ఇంటి నుంచి పారిపోయాడు.
బాలిక మృతదేహాన్ని పరుపులో మూట కట్టి ఇంటికి తాళం వేసి అక్కడినుంచి పారిపోయాడు. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. నిందితుడిని పట్టుకొని తమకు అప్పగించేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని పట్టుబట్టారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి అదృశ్యమైంది. అర్ధరాత్రి 12 గంటలకు నిందితుడు రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. నిందితుడు రాజును తమకు అప్పగించే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని బస్తీవాసులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాలనీలో 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరికి పోలీసులు బలవంతంగా మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ తోపులాటలో కొంత మంది పోలీసులు, స్థానికులకు గాయాలయ్యాయి. నిందితుడు రాజు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minor girl raped, RAPE