Home /News /telangana /

HYDERABAD MAN DIED IN SAUDI ARABIA WITH CORONA WIFE SEEKS HELP TO GET ATLEAST ASHES FOR DOING LAST RITES HSN

40 ఏళ్లుగా సౌదీలోనే.. హైదరాబాద్ కు శాశ్వతంగా తిరిగొస్తుండగా భర్త మృతి.. కనీసం అస్థికలనైనా ఇప్పించండంటూ భార్య కన్నీటి విన్నపం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు వైఫ్ ఆఫ్ రణసింగం సినిమాను చూశారా.? అదేనండీ ఐశ్వర్యారాజేష్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన ‘కా పే రణసింగం‘ తమిళ సినిమాకు తెలుగు వెర్షన్. గల్ఫ్ దేశంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని సొంతూరికి రప్పించేందుకు..

  మీరు వైఫ్ ఆఫ్ రణసింగం సినిమాను చూశారా.? అదేనండీ ఐశ్వర్యారాజేష్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన ‘కా పే రణసింగం‘ తమిళ సినిమాకు తెలుగు వెర్షన్. గల్ఫ్ దేశంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని సొంతూరికి రప్పించేందుకు భార్య చేసే పోరాటమే ఆ సినిమా ఇతివృత్తం. గల్ఫ్ దేశంలో ఎవరైనా చనిపోతే, సొంత దేశాలకు, సొంతూళ్లకు తీసుకురావడానికి ఎంత ప్రయాస పడాలో, ఎన్నెన్ని తిప్పలు పడాలో ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. భర్త మృతదేహాన్ని చివరిసారయినా చూసుకునేందుకు భార్య పడే వేదనను గుండెలకు హత్తుకునేలా, కన్నీళ్లు తెప్పించేలా సినిమాను తీశారు. ప్రస్తుతం అదే రీతిలో ఓ మహిళ విలపిస్తోంది. సౌదీలో మరణించిన తన భర్తకు సంబంధించిన అస్తికలను అయినా తెప్పించండి ప్లీజ్.. అంటూ వేడుకుంటోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  సికింద్రాబాద్ కు చెందిన బెజ్జరపు దశరథ్, జానకి దంపతులు దాదాపు 40 ఏళ్ల క్రితమే సౌదీ అరేబియాకు వలస వెళ్లారు. అక్కడే చిన్న ఉద్యోగం నుంచి మొదలు పెట్టి, ఓ వ్యాపారవేత్తగా దశరథ్ తన జీవితాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడిపోయారు. దశరథ్, జానకి మాత్రం సౌదీలోనే ఉండిపోయారు. వృద్దాప్యం మీదపడుతుండటంతో స్వస్థలమయిన హైదరాబాద్ కు వెళ్లిపొమ్మని వారి పిల్లలు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ దంపతులు కూడా ఏకీభవించారు. హైదరాబాద్ కు శాశ్వతంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ విథి వారి పట్ల ఆటలాడింది.
  ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు

  సొంతూరికి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్న ఆ దంపతులిద్దరికీ కరోనా సోకింది. అక్కడి సౌదీ అధికారులు వారిద్దరినీ చికిత్స నిమిత్తమై రెండు వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. తల్లిదండ్రులకు కరోనా సోకిందని అమెరికాలో ఉన్న కొడుక్కు తెలిసింది. నిబంధనలను సడలించి, తనకు హోం క్వారంటైన్ నుంచి మినహాయించి సౌదీకి పంపాల్సిందిగా వాషింగ్టన్ లోని సౌదీ అరేబియా ఎంబసీకి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇంతలోనే గురువారం దశరథ్ మరణించాడు. జానకి మాత్రం కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. అయితే నిబంధనల ప్రకారం కరోనాతో మరణించిన వారి మృతదేహాలను సౌదీ సర్కారు మున్సిపాలిటీకి అప్పగించి సుదూర ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తల మధ్య పూడ్చిపెడుతోంది.
  ఇది కూడా చదవండి: పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..

  భర్త మృతదేహాన్ని అయినా తనకు ఇస్తారనీ, చివరి చూపునకు నోచుకుంటానని భావించిన జానకికి ఈ విషయం తెలిసి కన్నీటిపర్యంతమవుతోంది. తన భర్త మృతదేహాన్ని తనకు అప్పగించాలనీ, తాము నమ్మే మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకుంటామని జానకి సంబంధిత అధికారులందరినీ వేడుకుంది. అయినప్పటికీ నిబంధనల ప్రకారం కరోనాతో మరణించిన వారిని బంధువులకు ఇవ్వబోమనీ, అంతే కాకుండా సొంతూళ్లకు తరలించేందుకు అంతర్జాతీయ నిబంధనలు కూడా అంగీకరించవని సౌదీ అధికారులు చెబుతున్నారు. దీంతో జానకి బాధ వర్ణనాతీతంగా మారింది. కనీసం తన భర్త అస్థికలనయినా తనకు ఇవ్వాలంటూ కనిపించిన ప్రతీవారినీ దీనంగా ఆడుగుతోంటే, ఆమె బాధను తగ్గించడం ఎవరి తరం కావడం లేదు.
  ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..

  కాగా, సౌదీలో విదేశీయులు ఎవరైనా మరణిస్తే, స్వదేశానికి పంపించేందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అతడిపై ఎలాంటి కేసు లేకుంటే, కొద్ది రోజుల్లోనే మృతదేహాన్ని స్వదేశానికి పంపించొచ్చు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాకుంటే, సౌదీ మున్సిపాల్టీ సిబ్బందే సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి మృతదేహాన్ని పూడ్చి పెడతారు. చనిపోయిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తయినా సరే, పూడ్చిపెట్టటమే సౌదీలో ఆనవాయితీ. ఇతర మత నిబంధనల ప్రకారం అక్కడ అంత్యక్రియలు జరపరు. అయితే దశరథ్ మాత్రం కరోనాతో మరణించడంతో మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయి. కరోనాతో మరణిస్తే, మృతదేహాన్ని విదేశాలకు పంపించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అధికారులే దగ్గరుండి పూడ్చిపెట్టాలన్న నిబంధనలనే ఇప్పటికీ పాటిస్తున్నారు. దశరథ్ విషయంలోనూ ఇదే పాటించడంతో జానకి బాధ వర్ణనాతీతంగా మారింది.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Dubai, Hyderabad, Kuwait, Saudi Arabia, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు