News18 Exclusive Story: హైదరాబాద్‌లో రూ.50కే లీటర్ పెట్రోల్...

10 ఏళ్లు శ్ర‌మ త‌రువాత ఈ రోజు ప్లాస్టిక్ తో కేవ‌లం పెట్రోల్ మాత్ర‌మే కాకుండా డిజీల్, విమాన ఇంధ‌నం కూడా త‌యారు చేయ‌డానికి ప్రార్మాలా ను క‌నిపెట్టారు ఇత‌ర దేశాల‌కంటే నాణ్య‌మైన ఇంధ‌నాల‌ను త‌యారు చేస్తోన్నానని న్యూస్ 18 తో ప్రో.స‌తీష్ కుమార్ అన్నారు.

news18-telugu
Updated: June 25, 2019, 3:19 PM IST
News18 Exclusive Story: హైదరాబాద్‌లో రూ.50కే లీటర్ పెట్రోల్...
హైదరాబాద్‌లో రూ.50కే లీటర్ పెట్రోల్ తయారీ
  • Share this:
రోజు రోజుకి పెట్రోల్ ధ‌రలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యం పెరుగుతున్న వాహనాల సంఖ్య‌తో పాటు వాటికి తోడు పెట్రోల్, డీజ‌ల్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతొంది. దీంతో ఆయిల్ ధ‌ర‌లు మ‌న‌కు అంద‌నంత ఎత్తులో కూర్చొంటున్నాయి. ఇదిలా ఉంటే మ‌రోవైపు మ‌న నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడ‌కం కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. డ్రైనేజీలు, చెరువులు,న‌దులు ఆఖ‌రికి స‌ముద్రాలు కూడా ఈ ప్లాస్టిక్ తో పూర్తిగా నిండిపోతున్నాయి ఇవి ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో హాని చేకూర్చుతున్నాయి. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకొని హైద‌రాబాద్‌కు చెందిన ఓ శాస్త్ర‌వేత్త స‌రికొత్త ఆలోచ‌న‌కు తెర‌తీశారు. అందులో విజ‌యం కూడా సాధించారు. ఇలా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్య‌ర్ధాల‌తో పెట్రోల్ త‌యారు చేసే టెక్నిక్ క‌నిపెట్టారు.

ప్రొఫెసర్ సతీష్ కుమార్


హైదరాబాద్‌కు చెందిన హైడ్రాక్సీ సిస్టమ్స్ & రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు ప్రొ.సతీశ్ కుమార్ చాలా ప‌రిశోధ‌న‌ల తరువాత ప్లాస్టిక్ వ్య‌ర్ధాల నుంచి పెట్రోల్‌తో పాటు డీజీల్ మ‌రియు విమాన ఇంధనం కూడా త‌యారు చేయోచ్చ‌ని నిరూపించారు. ప్ర‌స్తుతం ఈ టెక్నాల‌జీ ఇత‌ర దేశాలు జ‌ర్మ‌నీ,జ‌పాన్, అమెరికా వంటి వాటిల్లో ఉన్నప్పటికి ప్లాస్టిక్‌తో అంత క్వాలిటీ పెట్రోల్‌ను అక్క‌డ ఉత్ప‌త్తి చేయ‌లేక‌పోతున్నారు. అక్క‌డ శాస్త్ర‌వేత్త‌లు కానీ మ‌న దేశానికి చెందిన సతీష్ కుమార్ మాత్రం ఎంతో నాణ్య‌మైన పెట్రోల్‌ను ఉత్ప‌త్తి చేస్తున్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పెట్రోల్ తయారీ
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పెట్రోలు తయారు చేస్తున్న కంపెనీ


2015 నివేదిక‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ న‌గ‌రంలో రోజుకి 200 ట‌న్నుల ప్లాస్టిక్ పేరుకుపోతుందంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచన వేస్తున్నారు. “వాస్త‌వానికి నాకు ఈ ఆలోచ‌న రావ‌డానికి రోజురోజుకి న‌గ‌రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్య‌ర్ధాలే కార‌ణ‌మ‌ని చెప్పుకోవాలి. మ‌న‌ల్ని ప్ర‌ధానంగా వేధిస్తోన్న ఇంధ‌న, ప్లాస్టిక్ స‌మ‌స్య మాత్రేమే ముళ్లును ముళ్లుతోనే తీయాల‌న్న సూత్రాన్ని బాగా న‌మ్మే వ్య‌క్తిని నేను అందుకే ప్లాస్టిక్ తో ఏం చేయ‌గ‌లం అనే ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టికే జ‌ర్మ‌నీలో ప్లాస్టిక్ తో పెట్రోల్ త‌యారు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోన్నార‌న్ని వార్త నాలో ఆస‌క్తిని పెంచింది దాదాపుగా 10 ఏళ్లు శ్ర‌మ త‌రువాత ఈ రోజు ప్లాస్టిక్ తో కేవ‌లం పెట్రోల్ మాత్ర‌మే కాకుండా డిజీల్, విమాన ఇంధ‌నం కూడా త‌యారు చేయ‌డానికి ఫార్ములాను క‌నిపెట్టారు ఇత‌ర దేశాల‌కంటే నాణ్య‌మైన ఇంధ‌నాల‌ను త‌యారు చేస్తున్నానని’ న్యూస్ 18 తో ప్రో.స‌తీష్ కుమార్ అన్నారు.

దీని ద్వారా 500 కేజీల ప్లాస్టిక్ నుంచి 400 లీటర్ల ఇంధనం వస్తుంది. 200-240 లీటర్ల డీజిల్, 80-100 లీటర్ల విమాన ఇంధనం, 60 లీటర్ల పెట్రోల్, మిగిలిన పదార్థాలు 20 లీటర్లు వస్తాయి. ఇలా ఉత్ప‌త్తి చేసిన పెట్రోల్ సాధార‌ణ పెట్రోల్ లానే ప‌నిచేస్తోందని సతీష్ తెలిపారు. అలాగే 18 శాతం పెట్రోల్ వేడి చేయడానికి లేక పవరింగ్ ల్యాంపులకు ఉపయోగించుకోవచ్చు. ఇక 10 శాతం గ్యాస్ వేడి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. మొత్తం మీద అన్ని అనుకూలిస్తే త్వ‌ర‌లోనే పెట్రోల్ మ‌న‌కు అందుబాటు ధ‌ర‌లో ల‌భిస్తుందంటున్నారు స‌తీష్.
ప్లాస్టిక్ వ్యర్థాలు


ప్లాస్టిక్‌తో పెట్రోల్ ఎలా తయారు చేస్తారు?

ముందుగా పరిశ్రమల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను కీలో రూ.5 నుంచి రూ. 8 రూపాయిలకి కొనుగోలు చుస్తారు. అలా కొన్న ప్లాస్టిక్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. చేసిన తరువాత వాటిని కంటైనర్స్ లో వేసి వేడి చేస్తారు ఇలా వేడి చేసిన ప్లాస్టిక్ నుంచి డీజిల్, పెట్రోల్ మరియు వంట గ్యాస్ వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇలా ఉత్పత్తి అయిన పెట్రోల్ ను మార్కెట్‌లో లీటర్ రూ. 50 నుంచి రూ. 55 రూపాయిలకు అమ్ముతున్నామని సతీష్ తెలిపారు. ప్రభుత్వం మరిన్ని ప్రొత్సాహకాలు అందిస్తే భవిష్యత్‌లో ఉత్పత్తి సామర్ధ్యం పెంచి ఎక్కువ లీటర్లు ఉత్పత్తి చేస్తామని దాని ద్వారా మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే  మనకు పెట్రోల్ దొరుకుతొందంటున్నారు సతీష్. ప్రస్తుతం రోజుకి 200 లీటర్లు పెట్రోల్ మరియు డీజిల్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వేసిన తరువాత వచ్చిన బుడిద కూడా వేస్ట్ కాదని దాన్ని వాటిని బొగ్గుల వాడోచ్చని లేదా మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చని అంటున్నారు ప్రొఫెసర్ సతీష్.

(బాల‌కృష్ణ‌.ఎమ్, సీనియ‌ర్ కరెస్పాండెంట్ న్యూస్18 తెలుగు)
First published: June 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading