కుటుంబ సభ్యులపై ఎక్కువ ప్రేమ పెంచుకొని తట్టుకోలేని వాళ్లు కొందరు ఉంటారు. ఇంకా చెప్పాలంటే కట్టుకున్న భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే..అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసుకున్న భర్త..తన జీవిత భాగస్వామి తనకు దక్కకుండా శాశ్వతంగా దూరమైపోతుందనే భయం రావడం విషాదాన్ని మిగిల్చింది. కామారెడ్డి(Kamareddy)జిల్లా కనకల్(Kanakal)గ్రామానికి చెందిన 55సంవత్సరాల కొమురయ్య (Komurayya)కు భార్య సత్తెమ్మ, కుమార్తె వెంకటలక్ష్మి (Venkatalakshmi) ఉన్నారు. భార్య సత్తెమ్మ(Sattemma)కు పేగులో ఫంగస్(Intestinal fungus) చేరి అనారోగ్యంతో బాధపడుతుంటే చికిత్స నిమిత్తం సికింద్రాబాద్(Secunderabad)లోని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తీసుకొచ్చాడు. ఏప్రిల్April 29వ తేదిన గాంధీలో జాయిన్ చేయించాడు. సత్తెమ్మకు అన్నీ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు(Doctors) అదే రోజు ఆపరేషన్(Operation)చేసి పేగులోని ఫంగస్‌ని తొలగించారు. ఆరో అంతస్తు(Sixth floor)లోని వార్డుకు షిప్ట్ చేశారు. కొమురయ్య భార్యకు అటెండెంట్Attendantగా అదే వార్డులో పక్కనే ఉంటున్నాడు. పక్క వార్డులో ఉంటున్న రోగుల్లో వేర్వేరు కారణాలతో వరుసగా ముగ్గురు చనిపోయారు. పక్క వార్డులో రోగులు వరుసగా చనిపోవడాన్ని చూసిన కొమురయ్య తన భార్య పరిస్థితి కూడా క్రిటికల్‌గానే ఉందేమో అందుకే ఈ వార్డులో వేశారని బాధపడిపోయాడు. తోటి రోగులు చనిపోతున్నట్లుగా తన భార్య కూడా చనిపోతుందేమోననే భయంతో శుక్రవారంFriday అనగా మేMay 6వ తేదిన తెల్లవారుజామునే గాంధీ ఆసుపత్రి భవనం ఆరో అంతస్తు పైనుంచి దూకి బలవన్మమరణం(Suicide)చేసుకున్నాడు కొమురయ్య.
భార్యను బతికించుకోవడానికి వచ్చి..
కూలి పనులు చేసుకుంటూ గ్రామంలో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కొమురయ్య. కట్టుకున్న భార్యకు అనారోగ్యం చేస్తే ఆసుపత్రికి తీసుకొని ఆమె ప్రాణాలకు ఏమైనా ముప్పు ఏర్పడుతుందేమోననే భయంతో తాను ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా అందర్ని కలచివేసింది. మృతుడు కొమురయ్య తీసుకున్న నిర్ణయాన్ని వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మొదట భార్యకు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. కుటుంబ సభ్యులు, కుమార్తె వెంకటలక్ష్మికి సమాచారం అందించారు.
భయంతో అలా చేశాడు..
ఓ వ్యక్తి భార్య పట్ల పెంచుకున్న ప్రేమ అతని పాలిట పాశంగా మారిందని ఆసుపత్రి డాక్టర్లు చెప్పుకుంటున్నారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్లే ఇలాంటి వాటిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకునేందుకు సైతం సిద్ధమవుతారని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే చిన్న చిన్న విషయాలకే బాధపడే వ్యక్తులకు కౌన్సిలింగ్‌తో పాటు ఆసుపత్రి వంటి పరిసరాల్లోకి సాధ్యమైనంత వరకు రానివ్వకపోవడం మంచిదంటున్నారు డాక్టర్లు. ఆసుపత్రి పరిసరాల్లో ఉంటే పరిస్థితులు, అక్కడి జనం చెప్పుకునే మాటలు, తోటి రోగుల ఆరోగ్య పరిస్థితులు వింటుంటే చాలా మందికి తమ వాళ్లకు కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందోననే భయం ఉంటుంది. అలాంటి టైమ్‌లోనే ఇలాంటివి జరుగుతుంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.