Second Marriage: అతడి వయసు 49.. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. పెళ్లి కూడా ఫిక్స్ అయింది.. కట్ చేస్తే..

ప్రతీకాత్మక చిత్రం

అతని వయసు 49.. వృద్దాప్యంలో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం పలు మ్యారేజ్ బ్యూరోలను కాంటాక్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ మహిళతో పెళ్లి ఖరారు అయింది.

  • Share this:
    అతని వయసు 49.. వృద్దాప్యంలో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం పలు మ్యారేజ్ బ్యూరోలను కాంటాక్ట్ చేశాడు. ఈ క్రమంలోనే అతని ఓ వ్యక్తి కాల్ చేసి కొందరు మహిళల ఫొటోలు చూపించాడు. వారిలో ఒక మహిళా ఫొటో నచ్చడంతో.. పెళ్లి డేట్ (Marriage Date) కూడా ఫిక్స్ చేశారు. పెళ్లికి ఫంక్షన్ హాలు కూడా బుక్ చేశారు. అయితే పెళ్లికి రెండు రోజుల మందు తాను మోసపోయానని తెలుసుకున్న అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ (Gachibowli Police Station) పరిధిలో నివాసం ఉంటున్న బాధిత వ్యక్తి.. రెండో పెళ్లి చేసుకోవడం కోసం మూడు నెలల క్రితం మ్యారేజ్ బ్యూరోలను సంప్రదించి.. తన వివరాలను అందజేశాడు.

    అయితే అతని రెండు నెలల క్రితం పింద్రోతు శివయ్య అనే వ్యక్తి కాల్‌ చేశాడు. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలిలోని ఓ మ్యారేజ్‌ బ్యూరో నుంచి మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి శివయ్య.. కొందరు మహిళల ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపాడు. అయితే అతడు నచ్చలేదని చెప్పడంతో.. జూలై 10వ తేదీన మరికొన్ని ఫొటోలు పంపించగా.. అందులో వారు తనకు నచ్చలేదని అతడు చెప్పాడు.

    YS Jagan: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సహాయం.. అలా సీఎం కార్యాలయం నుంచి పిలుపు..

    ఆ తర్వాత శివయ్య ఓ ఫొటో పంపగా.. అది తనకు నచ్చిందని అతడు తెలిపాడు. ఇతర వివరాలు పంపమని కోరాడు. దీంతో శివయ్య.. ఆ మహిళది విజయనగరం జిల్లా (Vizianagaram District) అని చెప్పాడు. మహిళ, ఆమె కుటుంబానికి కూడా అతడు నచ్చాడని తెలిపాడు. దీంతో బాధిత వ్యక్తి ఆనందపడిపోయాడు. ఈ క్రమంలోనే బాధిత వ్యక్తి .. మహిళ నెంబర్ తీసుకని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు.

    శ్రీకాకుళం అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. కానీ అలా జరగడంతో..

    అయితే మహిళ కుటుంబానికి కొన్ని అప్పులు ఉన్నాయని.. వాటిని తీర్చాలని శివయ్య తెలిపాడు. దీంతో మహిళ అప్పులు తీర్చేందుకు బాధిత వ్యక్తి రూ4.89 లక్షలు చెల్లించాడు. ఆగస్టు 25న పెళ్లి ముహుర్తం ఖరారు కావడంతో.. అన్ని ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీ అయ్యాడు. ఫంక్షన్ హాల్ బుక్ చేయడంతో పాటుగా, ఇతర పనులు కూడా చూసుకుంటున్నారు. అయితే ముహుర్తానికి రెండు రోజుల ముందు శివయ్యకు ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆ తర్వాత మహిళ, ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా స్విచ్చాఫ్ అని వచ్చాయి. దీంతో అతడు ఆందోళన చెందారు. రెండు రోజుల పాటు వారి కోసం ప్రయత్నాలు చేశాడు. తీరా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని తెలుసుకుని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: