హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News: హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య..పట్టపగలే కత్తులతో..

Crime News: హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య..పట్టపగలే కత్తులతో..

హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హత్యలు, ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. భూతగాదాలు, ఆస్తుల పంపకాలు ఇలా కారణం ఏదైనా ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. ఇక తాజాగా మియాపూర్ బస్టాండ్ (Miyapur Bustand)లో పట్టపగలే దారుణ హత్య స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హత్యలు, ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. భూతగాదాలు, ఆస్తుల పంపకాలు ఇలా కారణం ఏదైనా ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. ఇక తాజాగా మియాపూర్ బస్టాండ్ (Miyapur Bustand)లో పట్టపగలే దారుణ హత్య స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. బస్టాండ్ లో ఉన్న వ్యక్తిపై కొంతమంది దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..24 గంటల్లోనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఈడీ!

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే హత్యకు గురైన వ్యక్తి ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్యకు పాత కక్షలు కారణమా? పట్టపగలు పక్కా ప్రణాళికతో హత్య చేసేంత అవసరం ఏముందని కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నాయి. కాగా ఈ హత్యతో స్థానికలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Hyderabad: హైదరాబాద్‌లో తిరుగుతున్న డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సుల ధరెంతో తెలుసా? అన్ని కోట్లా..!

కాగా కొన్నిరోజుల క్రితం కూడా హైదరాబాద్ లో ఓ దారుణ హత్య కలకలం రేపింది. నగరంలోని లంగర్ హౌజ్ లో ఓ యువకుడిని దుండగులు హత్య చేశారు. 25 ఏళ్ల కలీమ్ (Kaleam) ను ముగ్గురు దుండగులు అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. దీనితో కలీమ్ (Kaleam)  అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుని హత్యతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇక కలీమ్ (Kaleam)  హత్య తర్వాత ముగ్గురు పోలీసులకు లొంగిపోవడం కొసమెరుపు.

Ap-Telangana: మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా..షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ

ఇటీవల వరుస హత్యలు హైదరాబాద్ (Hyderabad) లో కలకలం రేపుతున్నాయి. ఆస్తి వివాదాలు, భూతగాదాలు ఇలా కారణం ఏదైనా కానీ క్షణికావేశంలో ప్రాణాలను తీయడానికి వెనకాడడం లేదు దుర్మార్గులు. హత్య తరువాత జరిగే పరిణామాలను పట్టించుకోని దుండగులు బాధిత కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తమ లాంటి కుటుంబమే వారిది అనే ఆలోచన వారికి గుర్తు రావడం లేదు. కోపంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారు. ఆపై జైలు ఊసలు లెక్కపెడుతున్నారు.

ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా పోలీసులు కఠిన శిక్షలు వేసినా కూడా దుండగుల్లో మార్పు రావడం లేదు. ప్రాణాలు తీసేంత కక్ష పెంచుకొని ఆ తరువాత తమ జీవితాన్ని కటకటాల పాలు చేసుకుంటున్నారు నిందితులు.

First published:

Tags: Brutally murder, Crime, Crime news, Hyderabad, Telangana

ఉత్తమ కథలు