HYDERABAD MAN BOOKED FOR DEMAND FOR EXTRA DOWRY AFTER ENGAGEMENT SU
ఆమె డాక్టర్.. అతడు బ్యాంకు మేనేజర్.. నిశ్చితార్థం జరిగిపోయింది.. కానీ పెళ్లి చేసుకోవాలంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఆమె డాక్టర్, అతడు బ్యాంకు మేనేజర్.. వారిద్దరికి కొన్ని వారాల కిందట నిశ్చితార్థం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబాలు ప్రయత్నాలు జరుపుతున్నాయి.
ఆమె డాక్టర్, అతడు బ్యాంకు మేనేజర్.. వారిద్దరికి కొన్ని వారాల కిందట నిశ్చితార్థం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబాలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే బ్యాంకు మేనేజర్ బాంబు పేల్చాడు. తాను ఈ పెళ్లి చేసుకోవాలంటే అదనపు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. ఇందుకోసం అమ్మాయి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక అమ్మాయి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి ఈఎన్టీ డాక్టర్‌గా పనిచేస్తుంది. ఆమె కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే జూన్ 6వ తేదీన ఆమెకు.. కర్నూలు జిల్లాకే చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడు కర్ణాటకలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
నిశ్చితార్థం జరిగిన సమయంలో యువతి కుటుంబం రూ. 50 వేలను కట్నంగా ఇచ్చింది. అలాగే వరకట్నం కింద ఐదెకరాల భూమి, రూ.25 లక్షల ప్లాటు, 40 తులాల బంగారం, పెండ్లి ఖర్చులకు రూ.3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. పెండ్లి పనులు మొదలయ్యాయి. అయితే నిశ్చితార్థం అయిన కొన్ని వారాలకు అతడు మనసు మార్చుకున్నాడు.
జూలై 25న యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన అతని కుటుంబ సభ్యులు తమ అబ్బాయికి అదనపు కట్నం కావాలని డిమాండ్ చేశారు. కట్నం కింద మరో 5 ఎకరాలు అదనంగా ఇవ్వాలని.. లేకుంటే ఈ పెళ్లి జరగదని చెప్పారు. ఈ క్రమంలోనే యువతి కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.