Home /News /telangana /

HYDERABAD MAN BLACKMAIL COUPLE WITH VIDEO IN HYDERABAD SU

Hyderabad: ఇవి నీ భార్య అశ్లీల వీడియోలు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయమంటావా?.. అసలు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ దంపతులు.. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగంలో బిజినెస్ చేస్తున్నారు. అయితే వారు రెండేళ్ల క్రితం ఓ పని నిమిత్తం కేరళకు చెందిన కార్మికులను నియమించుకున్నారు.

    ఆ దంపతులు.. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగంలో బిజినెస్ చేస్తున్నారు. అయితే వారు రెండేళ్ల క్రితం ఓ పని నిమిత్తం కేరళకు చెందిన కార్మికులను నియమించుకున్నారు. కార్మికులకు వ చెల్లింపులు నిలిచిపోవడంతో.. దీంతో ఓ కార్మికుడు అశ్లీల వీడియోలు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసకుంది. వివరాలు.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉండే దంపతులు.. 16 ఏళ్లుగా నిర్మాణ అనుబంధ రంగంలో వ్యాపారంలో ఉన్నారు. 2018-19 సంవత్సరంలో ఓ నిర్మాణం నిమిత్తం కేరళకు చెందిన కార్మికులను నియమించుకున్నారు.

    జీఎస్‌టీని సరిగా నమోదు చేయకపోవడంతో దాదాపు రూ.7 లక్షల మేర కార్మికులకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కార్మికులకు పైసలు ముట్టలేదు. ఎన్నిసార్లు కలిసిన లాభం లేకుండా పోయింది. దీంతో ఓ కార్మికుడు.. ఆ దంపతుల అకౌంటెంట్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే దంపతుల ఫోన్ నెంబర్లు తీసుకుని వారిని వేధించడం మొదలు పెట్టాడు.

    ఇవి చదవండి: పోర్న్ వీడియోలకు బానిసగా మారిన భర్త.. నిజం తెలుసుకున్న భార్య.. ఆమె ఏం కోరిందంటే..

    Crime News: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు.. ఇలా జరుగుంతుందని అసలు ఊహించి ఉండడు.. మర్మాంగాన్ని కోసేసి..

    ఈ క్రమంలోనే గత నెలలో దంపతులకు ఫోన్ చేసిన కార్మికుడు.. వారిని దూషించాడు. అశ్లీల వీడియోలు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం.. వాట్సాప్‌లో భర్తకు అశ్లీల వీడియొలు పంపి.. అవి అతని భార్యవేనని బెదిరించాడు. డబ్బులు చెల్లించకుంటే వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ దంపతులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Blackmail, Crime news, Hyderabad

    తదుపరి వార్తలు