మెడనొప్పి కోసం ... (సర్వికల్ స్పాండిలైటిస్)కు చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్తే... రోగి కాళ్లు చేతులు, పనిచేయకుండా చేశారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుుంది. ఓ వ్యక్తి మెడ నొప్పితో చికిత్స కోసం... నిమ్స్‌కు వెళ్లాడు. అయితే ఆ చికిత్స తర్వాత ఇప్పుడు తన కాళ్లు, చేతులు పనిచేయకుండా చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. తనకు పక్షవాతం వచ్చి, మంచానికే పరిమితమయ్యాయని తన ఫిర్యాదులో అతడు పేర్కొన్నారు.
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యమే తన ఈ పరిస్థితికి కారణమని ఆరోపించాడు. దీంతో పరిహారం కింద తనకు రూ.2 కోట్లు ఇప్పించాలని కమిషన్ ముందు మొరపెట్టుకున్నారు. నిమ్స్ డైరెక్టర్‌తో పాటు న్యూరోసర్జరీ విభాగానికి చెందిన ఇద్దరు డాక్లర్లపై ఫిర్యాదు చేశాడు. డిసెంబరు 21న కమిషన్‌ను ఆశ్రయించగా... వివరాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిమ్స్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా సర్వికల్ స్పాండిలైటిస్ కారణంగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నారు.
దీంతో స్థానికంగా ఉన్నడాక్టర్ల వద్ద చికిత్స చేయించుకున్నాడు. అయితే అక్కడి మందులు తీసుకున్నా నయం కాలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించగా... నిమ్స్‌కు రిఫర్ చేశారు. దీంతో నిమ్స్‌లోని న్యూరో విభాగంలో చేరగా... గతేడాది ఆగస్టు 13న అతనికి సర్జరీ చేశారు. ఈ సందర్భంగా వెన్నెముకకు గాయం కావడంతో పక్షవాతం వచ్చిందని, ఎంఆర్‌ఐలో ఆ విషయం స్పష్టంగా తేలిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాక తనకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఈ సర్జరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ... తన చేత సీఎంఆర్‌ఎఫ్ కింద దరఖాస్తు చేయించారన్నారు. దీంతో రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరు అయినట్లు తెలిపారు. అయితే చికిత్స చేయించుకున్నాక తనకు కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయని .. రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రియించాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Nims