Home /News /telangana /

HYDERABAD MALKAJGIRI SI VIJAYKUMAR SUSPENDED IN CASE OF RAPE OF YOUNG WOMAN SNR

Telangana| Hyd : నిన్న సీఐ..నేడు ఎస్‌ఐ ఆడవాళ్లను చెరబట్టిన కేసులో సస్పెండ్ ..వీళ్లు పోలీసులా లేక పోకిరోళ్లా

(ఎస్‌ఐపై రేప్ కేసు)

(ఎస్‌ఐపై రేప్ కేసు)

Crime news: పోలీస్‌శాఖలో పని చేస్తున్న కొందరు పోకిరోళ్లల ప్రవర్తిస్తూ పోస్ట్‌లు పోగొట్టుకుంటున్నారు. ఆడవాళ్ల మాన, ప్రాణాలను తీసేందుకు ప్రయత్నించి పోలీస్‌శాఖకు చెడ్డపేరు తెస్తున్నారు. ఓ సీఐ అత్యాచారం కేసులో సస్పెండ్‌ అయిన 24గంటల్లోనే మరో ఎస్‌ఐ యువతిని శారీరకంగా వాడుకొని మోసం చేసి విధుల నుంచి తొలగించబడ్డాడు.

ఇంకా చదవండి ...
హైదరాబాద్‌(Hyderabad)లో వివాహితపై అత్యాచారం చేసి ఆమె భర్తను చంపుతానంటూ బెదిరించిన కేసులో ఓ సీఐ సస్పెండ్ (suspended )అయిన 24గంటల్లోపే మరో ఎస్‌ఐ అదే తరహా నేరానికి పాల్పడ్డాడు. యువతిని లోబర్చుకొని..ఆమెకు తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు. తీరా ఆమె నిలదీయడంతో సహజీవనం(coexistence)చేయమని బెదిరించడంతో బాధితురాలు ఎస్‌ఐ (si)బండారాన్ని బయటపెట్టింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు.

ఎస్‌ఐ సస్పెండ్..
అమ్మాయిని శారీరకంగా వాడుకొని మోసం చేసిన కేసులో తెలంగాణకు చెందిన మరో పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని మల్కాజ్‌గిరి సీసీఎస్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌ ధరావత్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ బాధితురాలితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి..ఆమెను శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. యువతితో శారీరక సంబంధం పెట్టుకున్న ఎస్ఐ విజయ్‌కుమార్ ఆమెకు తెలియకుండానే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు విజయ్‌కుమార్‌ని నిలదీయడంతో తనతో సహజీవనం చేయాలని బెదిరించినట్లుగా బాధితురాలు పోలీస్‌ కంప్లైంట్‌లో పేర్కొంది.



సహజీవనం పేరుతో మోసం..
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన అధికారులు అతను మోసం చేసినట్లుగా నిర్ధారించి ఎస్‌ఐ విజయ్‌కుమార్ ధరావత్‌పై ఐపీసీ సెక్షన్‌ 376(2)(n),417,420 కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్‌ఐ మోసం చేసినట్లుగా నమోదైన కేసులో విచారణ జరపి సమగ్ర నివేదకను సమర్పించాలని మల్కాజ్‌గిరి ఏసీపీని ఆదేశించారు సీపీ మహేష్‌భగవత్. ఏసీపీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మల్కాజ్‌గిరి సీసీఎస్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ధరావత్‌ను సస్పెండ్ చేశారు.

Adilabad : ఆషాడమాసంలో ఆ పండుగ ఆడవాళ్లకు మాత్రమే .. ఆదిలాబాద్‌లో వేడుకగా జరుపుకున్న ఆడపడుచులు



నిన్న సీఐ..నేడు ఎస్‌ఐ..
నేరాలు, మోసాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టాల్సిన పోలీసులే మహిళల విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించడం సంచలనంగా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో ప్రజల మన్ననలు పొందాలని పోలీస్‌శాఖ చెబుతుంటే ..అధికారులు మాత్రం ఇలాంటి అరాచకాలు, అఘాయిత్యాలకు పాల్పడుతూ పోలీస్‌శాఖకు చెడ్డ పేరు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Mulugu: భారీ వర్షాలతో మునిగిపోతున్న ములుగు జిల్లా .. ఏజెన్సీ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు


Published by:Siva Nanduri
First published:

Tags: Greater hyderabad, Telangana crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు