హోమ్ /వార్తలు /తెలంగాణ /

Variety sweet: మలాయ్ గులాబ్ జామూన్ అంటే అక్కడే తినాలి

Variety sweet: మలాయ్ గులాబ్ జామూన్ అంటే అక్కడే తినాలి

malay gulab jamun

malay gulab jamun

Hyderabad:హైదరాబాద్ పేరు చెబితే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, బిర్యానీకి ఫేమస్ అనుకుంటారు. అంతే కాదు .. వెరైటీ స్వీట్లకు పుట్టిన స్తలం అని చాలా మందికి తెలియదు. ఇక్కడ తయారయ్యే మలాయ్ గులాబ్ జామూన్‌ని ఒక్కసారి టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు. మరి అది ఎక్కడ లభిస్తుందో తెలుసా..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(M.Balakrishna,News18,Hyderabad)

హైదరాబాద్(Hyderabad)పేరు చెబితే ఇరానీ చాయ్(Irani Chai), ఉస్మానియా బిస్కెట్లు(Osmania Biscuits), బిర్యానీ(Biryani)కి ఫేమస్ అనుకుంటారు. అంతే కాదు .. వెరైటీ స్వీట్లకు పుట్టిన స్తలం అని చాలా మందికి తెలియదు. ఇక్కడ అనేక రకాల స్వీట్లు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ వచ్చిన వారు ఎవరైనా బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరు. తాజాగా ఆ జాబితాలో మలాయ్ గులాబ్ జామూన్( malay gulab jamun) చేరింది. నాలుగు దశాబ్దాలుగు టోలిచౌకీ(Tolichouki)ప్రాంతంలో హుసేన్ డెయిరీ(Hussain Dairy)నిర్వహిస్తోన్న స్వీట్ షాపులో మలాయ్ గులాబ్ జామూన్ ప్రత్యేకంగా నిలిచింది.

Wedding moments: మూఢాల తర్వాత ఇవే ముహుర్తాలు .. డిసెంబర్‌ నెల 20రోజుల్లో ఎన్ని లక్షల పెళ్లిళ్లో తెలుసా

హైదరాబాద్‌లో ఫేమస్ స్వీట్..

హైదరాబాద్‌ టౌలిచౌకీలోని హుసేన్ డెయిరీలో లభించే మలాయ్ గులాబ్ జామూన్ మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తారు. సిటీలోని టోలిచౌకి ప్రాంతంలో మాత్రమే లభించే మలాయ్ గులాబ్ జామూన్ అంటే చాలా మందికి ఇష్టం. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వీట్‌ని టేస్ట్ చేస్తారు. పార్సిల్స్ తీసుకెళ్తారు. ఒక్కసారి దీని రుచి చూశారంటే ఇక వదలరు. ధర కూడా అందుబాటులోనే ఉండటంతో రోజూ వేలాది మంది ఈ మలాయ్ గులాబ్ జామూన్ తినేందుకు వస్తూ ఉంటారు. కాకతీయ నగర్ లో హుసేన్ డెయిరీ అంటే ప్రతి ఒక్కరికీ పరిచయమే. నాలుగు దశాబ్దాలుగా పాల వ్యాపారం నిర్వహిస్తూ, పాలతో తయారు చేసే స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసే మలాయ్ గులాబ్ జామూన్ మాత్రం హైదరాబాద్ కే ప్రత్యేకం అని చెప్పవచ్చు.

తయారి విధానం..

ముందుగా మైదాపిండి, రవ్వ, పాలపొడి, పాలు, బేకింగ్ పౌడర్, నెయ్యి అన్నింటిని ఒక బౌల్లోకి వేసి మెత్తగా చపాతీ పిండిలా కలపాలి. తరవాత 3 గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. మూడు గంటల తర్వాత తిరిగి కొద్దిగా పాలు పోసి మళ్ళీ సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి రెడీ అవుతుంది. స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. మీడియం మంట పెట్టి నూనె కాగనివ్వాలి. అంతలోపు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. చిన్న ఉండలు చుట్టే ముందు, చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల తేలికగా సాప్ట్ గా జామూన్ బాల్స్ తయారవుతాయి.  ఫ్రయింగ్ పాన్ లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో జామూన్ బాల్స్ వేయాలి.  బ్రౌన్ కలర్ వచ్చేవరకూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని తీసి, షుగర్ సిరఫ్ లో వేసి, పదినిముషాలు నాననివ్వాలి. తర్వాత ఒక్కొ గులాబ్ జామ్ కి చిన్న గాటులా పెట్టి లోపల మలైను నింపుతారు. చివరగా గులాబ్ జామూన్ల మీద తాజా కొబ్బరి తురుమును వేసి మరింత రుచిని జోడిస్తున్నారు.

ఆ ఒక్కచోటే లభించే స్వీట్..

ఇలా హుసేన్ డెయిరీ మలై గులాబ్ జామూన్ లను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా తయారు చేస్తోంది. కేవలం హైదరాబాద్ వాసులే కాదు. దూర ప్రాంతాల నుంచి కూడా తాము తయారు చేసి మలై గులాబ్ జామూన్ తీసుకువెళుతున్నారని షాపు యజమానులు చెబుతున్నారు.

First published:

Tags: Hyderabad, Sweets, Telangana News

ఉత్తమ కథలు