దొరికిందే ఛాన్స్.. హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి పనులు..

జీహెచ్‌ఎంసీ.. పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. దాదాపు రూ.30వేల కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫ్లై ఓవర్ లు, స్కై వేలు, బీటీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతోంది.

news18-telugu
Updated: April 29, 2020, 1:21 PM IST
దొరికిందే ఛాన్స్.. హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి పనులు..
హైదరాబాాద్‌లో వేగంగా అభివృద్ధి పనులు (Photo : Twitter)
  • Share this:
హైదరాబాద్‌లో చిన్న గల్లీలో రోడ్డెయ్యాలన్నా ఇబ్బందే. దారి మళ్లింపులు చేస్తే ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అందుకే జీహెచ్‌ఎంసీ సిబ్బంది రాత్రి వేళల్లో రోడ్లు వేయడం, గుంతలు తవ్వడం, డ్రైనేజీ పైపులైన్లు, మరమ్మతులు.. తదితర అభివృద్ధి పనులు చేస్తుంటారు. అయితే, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో జనాలు రోడ్డెక్కలేకపోతున్నారు. ఇదే మంచి తరుణం అనుకున్న జీహెచ్‌ఎంసీ.. పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. దాదాపు రూ.30వేల కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫ్లై ఓవర్ లు, స్కై వేలు, బీటీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతోంది. వాహనాల రద్దీ లేకపోవడంతో రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోంది. దొరికిందే మంచి ఛాన్స్ అనుకొని అధికారులు కూడా.. ట్రాఫిక్ సమస్య ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్ల నిర్మాణం, ఇతర పనులు చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అటు కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటూనే, అభివృద్ధి పనులపైనా ఓ కన్నేశారు.

కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్.. మునిసిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్‌తో కలిసి నెక్లెస్ రోడ్‌లో రూ.26 కోట్ల వ్యయంతో 6 కిలోమీటర్ల మేర చేపట్టిన VDCC రోడ్డు పనులు, సికింద్రాబాద్ బోట్స్ క్లబ్ వద్ద రూ.25 లక్షల వ్యయంతో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. కవాడిగూడలో కొనసాగుతున్న సేవరేజ్ లైన్ పనులను కూడా ఆయన పరిశీలించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 29, 2020, 1:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading