హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: మాదాపూర్‌ ఎస్‌ఐకి రెండేళ్ల జైలుశిక్ష .. ఛీ ఆ విషయంలో కక్కూర్తి పడినందుకే..

Hyderabad: మాదాపూర్‌ ఎస్‌ఐకి రెండేళ్ల జైలుశిక్ష .. ఛీ ఆ విషయంలో కక్కూర్తి పడినందుకే..

Corruption SI

Corruption SI

Corruption SI : పోలీస్ ఆఫీసర్ కాసుల కోసం కక్కూర్తి పడినందుకు జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్‌ లాంటి సిటీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యంగ్ ఆఫీసర్ లంచావతారం బయటపడటంతో కోర్టు సరైన శిక్ష విధించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సమాజంలో శాంతి భద్రతల్ని, పౌరుల ఆస్తులతో మాన, ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి తప్పు చేశాడు. నేరాలు చేసిన వాళ్లపై కేసులు పెట్టి ..వాళ్ల నేరాలను సాక్ష్యాదారాలతో సహా రుజువు చేసి కటకటాల వెనక్కి పంపించాల్సిన పోలీస్ ఆఫీసర్ కాసుల కోసం కక్కూర్తి (Bribe)పడినందుకు జైలు ఊచలు(SI jailed) లెక్కబెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్‌(Hyderabad) లాంటి సిటీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(Sub Inspector)గా విధులు నిర్వహిస్తున్న ఓ యంగ్ ఆఫీసర్ లంచావతారం బయటపడటంతో డిపార్ట్‌మెంట్‌కి చెందిన సిన్సియర్ ఉద్యోగులు షేమ్‌గా ఫీలవుతున్నారు. ఇంతకీ హైదరాబాద్‌లో ఎస్‌ఐ ఏ విషయంలో జైలుపాలయ్యాడో తెలుకున్న ప్రతి ఒక్కరు ఛీ అంటూ చీదరించుకుంటున్నారు.

Baby sale : 5రోజుల ఆడపిల్ల ఖరీదు 40వేలు .. బిడ్డలను బొమ్మలుగా అమ్ముతున్న తండ్రి .. ఎక్కడంటే



ఎస్‌ఐకి రెండేళ్ల జైలుశిక్ష..

నిన్నటి వరకు ఒంటిపై ఖాకీ యూనిఫామ్‌తో స్టేషన్‌లో దర్జా వెలగబెట్టిన ఒక సబ్‌ ఇన్స్‌పెక్టర్ ..ఇకపై ఖైదీ డ్రెస్సులో జైలు జీవితం గడపనున్నారు. ఇది సినిమా స్టోరీ కాదు. కల్పితం అంత కంటే కాదు. అతని పేరు కే. రాజేంద్ర. సబ్‌ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఒంటిపైన పోలీస్ యూనిఫామ్ లేకుండా చేసుకున్నాడు ఈ ఎస్‌ఐ. కేవలం పది వేల రూపాయలకు కక్కూర్తి పడి లంచం తీసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో ఎస్‌ఐ రాజేంద్రకు రెండేళ్ల జైలు శిక్ష పడింది .

10వేలకు కక్కూర్తి పడినందుకు..

రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ పరిధిలో 9ఏళ్ల క్రితం అంటే 03.06.2013 నాడు ఇర్షాద్‌ ఖురేషి అనే వ్యక్తి దగ్గర పది వేలు లంచం తీసుకున్నారు ఎస్‌ఐ రాజేంద్ర. మోటర్‌ బైక్‌పై ఉన్న కేసులను తొలగించి వాహనాన్ని విడిపించి ఇవ్వడానికి ఎస్‌ఐ రాజేంద్ర ఖురేషిని పది వేలు లంచం డిమాండ్ చేశాడు. అదే సమయంలో రాజేంద్ర లంచావతారాన్ని అవినీతి నిరోదకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి ఛార్జ్‌ షీట్ వేశారు ఏసీబీ అధికారులు.

Cyber ​​fraudsters : బీఎండబ్లూ కారు గెలుచుకున్నావని 9లక్షలు కాజేశారు .. టీవీ షో పేరు చెప్పి ఇదంతా చేశారు



ఖాకీ డ్రెస్‌ బదులుగా ఖైదీ డ్రెస్ ..

అవినీతికి పాల్పడుతూ బాధ్యతాయుతమైన సబ్‌ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌ని కళంకం తెచ్చారనే కారణంతో ఎస్‌ఐ రాజేంద్రపై కోర్టు సీరియస్‌గా పరిణగించింది. ఈకేసులో విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్సై రాజేందర్ నేరం చేసినట్లుగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఐదు వేల రూపాయల జరిమానాకు చెల్లించాలని తీర్పిచ్చింది. ఒకవేళ ఐదు వేల జరిమానా చెల్లించలేని పక్షంలో అదనంగా మరో మూడు నెలలు జైలుశిక్షను అమలు చేయాలని కోర్టు తీర్పు వెల్లడించింది. ఎస్‌ఐగా నేరస్తుల గుండెల్లో దడ పుట్టించాల్సిన వ్యక్తి ఇప్పుడు తప్పు చేసి ఓ నేరస్తుడు కావడంపై జనం మంచి శిక్షపడిందంటున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని..తప్పు చేస్తే పోలీస్ అధికారికైనా జైలుశిక్ష తప్పదని మరికొందరు అంటున్నారు.

First published:

Tags: Corruption, Hyderabad crime, Police arrest

ఉత్తమ కథలు