Home /News /telangana /

HYDERABAD MAA ELECTIONS UPDATE BEFORE 17 YEARS MOHAN BABU WIN IN MAA ELECTIONS THIS TIME MANCHU VISHNU WILL WIN OR NOT NGS

MAA Elections: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. 17 ఏళ్ల తరువాత సీన్ రిపీట్ అవుతుందా..?

ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు (Twitter/Photo)

ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు (Twitter/Photo)

Maa Elections: మా ఎన్నికల్లో రోజు రోజుకూ హీట్ పెరుగుతోంది. తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగాబ్రదర్ మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం స్క్రీన్ మీద మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నా..? తెర వెనుక మోహన్ బాబు వర్సస్ మెగాస్టార్ గా మారింది. అయితే 17 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మోహన్ బాబు గెలుపొందారు. మరి ఆ సెంటిమెంట్ ను మంచు విష్ణు కంటిన్యూ చేస్తారా లేదా అన్నది చూడాలి..

ఇంకా చదవండి ...
    MAA Elections: తెలుగు సినిమా సభ్యులంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే "మా" ఎన్నికలకు సమయం దగ్గర పడింది. పోటీ ఎవరి మధ్య అన్నది తేలిపోయింది. దీంతో గెలుపు కోసం మంచు విష్ణు (Manchu Vishnu) ప్యానెల్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో ప్రస్తుతం మా ఎన్నికలు (MAA ELECTIONS) హీటెక్కాయి. ఓ వైపు మంచు విష్ణు ప్యానెల్ దూకుడుగా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు ప్రకాష్ రాజ్ సైతం.. మంచు విష్ణుపై విమర్శలు చేస్తూనే.. ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ సారి సినీ మా ఎన్నికలు బాగా రసవత్తరంగా జరగనున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్స్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్టు ఫిర్యాదుల వరకు వెళ్లారు. టాలీవుడ్ (Tollywood) లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది. ‘మా’ ఎలక్షన్స్ వేడి రోజు రోజుకి పెరుగుతుంది. అక్టోబర్ 10వ తేదీన ‘మా’ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు దగ్గ్గర పడటంతో ప్రకాష్ రాజ్–మంచు విష్ణు ప్యానెళ్లు ప్రచార జోరు పెంచారు. అయితే ఈ ఎన్నికలకు 17 ఏళ్ల కిందటి ఎన్నికలకు లింకు పెడుతున్నారు కొందరు. దీనికి రీజన్ ఏంటో తెలుసా..?

    1998లో అక్కినేని నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షుడిగా, హీరో కృష్ణ అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మొదలైంది. చాలా వరకు పోటీ లేకుండా ప్రశాంతంగా ‘మా’ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి అలాంటి ప్రశాంతత కనిపించట్లేదు. ఈ సారి మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. సరిగ్గా 17 ఏళ్ళక్రితం 2004 అక్టోబర్ 10న కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.

    అప్పుడు జరిగిన ఆ ఎన్నికల్లో మోహన్ బాబు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అప్పుడు ఆయన ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మళ్ళీ సరిగ్గా 17 ఏళ్ళకు అదే రోజున ఇప్పుడు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సారి మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. ఈ సారి ఏకగ్రీవం లేదు.. పోటీ ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. మరి తండ్రి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ విష్ణు విజయం సాధిస్తారా లేదా అన్నది చూడాలి..

    ప్రస్తుతం ఈ సారి మాత్రం ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది. మరో నాలుగు రోజుల్లో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ఎవరి ప్యానల్ నెగ్గుతుందో అని టాలీవుడ్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినీ రంగంలోని ప్రముఖుల మద్దతు కోరుతూ మంచు విష్ణు తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజులను కలిసి మద్దతు కోరారు. ఓ వైపు సినీ ప్రముఖల మద్దతు కోరుతూనే మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.

    మంచు విష్ణు దూకుడు చూస్తున్న కొందరు.. ఈసారి ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించే అవకాశం లేకపోలేదని అనుకుంటున్నారు. ఈ సమయంలోనే ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగడం కొత్త చర్చకు తెరలేపింది. ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నిలిచిన నాగబాబు.. మంచు విష్ణు ప్యానల్‌కు మద్దతుగా నిలుస్తున్న నరేశ్ వంటి పలువురిపై సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఎన్నిక మెగా వర్సెస్ మంచుగా మారింది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Actor prakash raj, Andhra Pradesh, AP News, Babu Mohan, Hero manchu vishnu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు