హోమ్ /వార్తలు /telangana /

Hyderabad : గ్యాస్ సిలిండర్ పేలి 3అంతస్తుల ఇల్లు ధ్వంసం -ఒకరు మృతి, 11 మందికి గాయాలు

Hyderabad : గ్యాస్ సిలిండర్ పేలి 3అంతస్తుల ఇల్లు ధ్వంసం -ఒకరు మృతి, 11 మందికి గాయాలు

గ్యాస్ సిలిండర్ పేలుడుకు మూడంతస్తుల భవంతి ధ్వంసం

గ్యాస్ సిలిండర్ పేలుడుకు మూడంతస్తుల భవంతి ధ్వంసం

నానక్‌రామ్‌గూడలోని ఓ నివాస సముదాయంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మూడంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది..

ఇంకా చదవండి ...

హైదరాబాద్(Hyderabad) లో భారీ ప్రమాదం జరిగింది. నగరంలోని నానక్‌రామ్‌గూడలో వంట గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సిలిండర్ పేలడంతో మూడంతస్తుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించగా, గాయపడ్డ 11 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి స్థానికులు, హైదరాబాద్ పోలీసులు చెప్పిన వివరాలివి..

నానక్‌రామ్‌గూడలోని ఓ నివాస సముదాయంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మూడంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. తెల్లవారుజామున 4.55 గంటలకు పేలుడు జరిగిన సమయంలో నివాస సముదాయంలో అందరూ నిద్రిస్తుండటం, బిల్డింగ్ కూలి శకలాలు మీదపడటంతో ఎక్కువ మందికి గాయాలయ్యాయి.

ధ్వంసమైన భవంతి

పేలుడు ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతృలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతోన్నవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: BLAST, Hyderabad, LPG Cylinder

ఉత్తమ కథలు