హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో గ్రెనేడ్ దాడుల కుట్ర కేసు.. NIA కీలక రిపోర్ట్...!

హైదరాబాద్‌లో గ్రెనేడ్ దాడుల కుట్ర కేసు.. NIA కీలక రిపోర్ట్...!

హైదరాబాద్ పోలీసులు అక్టోబర్ 1, 2022 న జాహెద్ ఆవరణలో రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మొబైల్ ఫోన్లు మరియు రూ. 3,91, 800 స్వాధీనం చేసుకున్న తర్వాత UAPA ఆరోపణల కింద కేసు నమోదు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ), చట్టవిరుద్ధమైన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) తమ సానుభూతిపరులకు హ్యాండ్ గ్రెనేడ్‌లను అందుబాటులో ఉంచి హైదరాబాద్ నగరంలో దాడులు మరియు పేలుళ్లకు కుట్ర పన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) వెల్లడించింది.

నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేశారు. దేశ అంతర్గత భద్రతకు భంగం కలిగించాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. జాహెద్, సమిద్దున్, మజా హసన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దసరా వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలను హత్య చేసేందుకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. జాహెద్‌తో పాటు, 2022 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నినందుకు మాజ్ హసన్ ఫరూక్ మరియు సమీయుద్దీన్‌లపై కూడా NIA కేసులు నమోదు చేసింది, వీరిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు నమోదు చేయబడింది.

హైదరాబాద్ పోలీసులు అక్టోబర్ 1, 2022 న జాహెద్ ఆవరణలో రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మొబైల్ ఫోన్లు మరియు రూ. 3,91, 800 స్వాధీనం చేసుకున్న తర్వాత UAPA ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ఈ కేసుకు అంతర్రాష్ట్ర మరియు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నందున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన కౌంటర్ టెర్రరిజం మరియు కౌంటర్ రాడికలైజేషన్ విభాగం కేసును NIAకి అప్పగించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో హైదరాబాద్ సీపీ కార్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఓ హోంగార్డు మరణించాడు. ఈ ఘటనలో జాహెద్ ఆత్మాహుతి బాంబర్‌కు ఆశ్రయం కల్పించాడు. ఈ కేసులో జాహెద్ 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జాహెద్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

First published:

Tags: Hyderabad, Local News

ఉత్తమ కథలు